Thursday, 13 October 2022

సమగ్ర శిక్షా సొసైటీ, కెజిబివి ఉద్యోగులకు మినిమం టైంస్కేల్ అమలు చెయ్యాలి

సమగ్ర శిక్షా సొసైటీ, కెజిబివి ఉద్యోగులకు మినిమం టైంస్కేల్ అమలు చెయ్యాలిఎస్పిడి కార్యాలయం వద్ద రాష్ట్ర స్థాయి ధర్నా సమగ్ర శిక్షా సొసైటీ, కెజిబివి లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, పార్ట్ టైం పద్ధతిలో పనిచేస్తున్న అన్ని కేడర్లకు 25 వేల మంది ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జిఓ నెం 5 ప్రకారం మినిమం టైంస్కేల్: సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని, రద్దు చేసిన ఆర్ట్ క్రాఫ్ట్ పోస్టులను ప్రభుత్వం పునరుద్ధరించాలని డిమాండ్ సెప్టెంబర్ 30వ తేదీన విజయవాడలోని స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర స్థాయి ధర్నా కార్యక్రమం సమగ్ర శిక్షా  ఉద్యోగుల జెఎసి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఎస్ఎస్ఎ ఉద్యోగుల ఆందోళనకు మద్దతుగా ఈ కార్యక్రమంలో పిడిఎఫ్ కే.ఎస్. లక్ష్మణరావు, షేక్ సాబ్జి, ఐ.వెంకటేశ్వరరావు ఎంఎల్సీలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కే.ఎస్. లక్ష్మణ రావు మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్నికల కంటే ముందు ప్రతిపక్షనేతగా సమగ్ర శిక్షా ఉద్యోగులకు మినిమం టైంస్కేల్, సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగభద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి 3 సం॥లు అవుతున్నా ఒక్క హామీ కూడా అమలు కాలేదు.. తక్షణమే వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మాట్లాడుతూ 2019లో ప్రభుత్వం సమగ్ర శిక్షా ఉద్యోగులకు, కెజిబివి సిబ్బందికి మినిమం టైంస్కేల్ ఇవ్వాలని జిఓ నెం. 24 ఇచ్చింది. ఆ జిఓను ప్రస్తుత ప్రభుత్వం అమలు చెయ్యకుండా 2020 లో జిఓ నెం 40 ని ఇస్తూ మినిమం టైంస్కేల్ అమలు చేస్తామని పేర్కొంది. ఈ జిఓ కూడా అమలు చెయ్యకుండా గత సంవత్సరం లో జిఓ నెం. 5 ను ప్రభుత్వం విడుదల చేసింది. జిఓ నెం. 5 ప్రకారం సమగ్రశిక్ష సొసైటీ, కెజిబివి ఉద్యోగులతో ఎంటిఎస్ అమలవుతుందనే ఎంతో ఆశతో ఎదురుచూసిన ఉద్యోగులకు నిరాశే మిగిలింది అన్నారు.ఎమ్మెల్సీ ఐ. వెంకటేశ్వరావు మాట్లాడుతూ సమగ్రశిక్షా సొసైటీ, కెజిబివి ఉద్యోగులకు 2017 లో గత తెలుగుదేశం ప్రభుత్వంలో పెరిగిన వేతనాల తోటే నేటీకి బ్రతుకుతున్న పరిస్థితి. ప్రస్తుత ప్రభుత్వం మినిమం టైంస్కేల్ అమలు చేస్తామని జిఓ లు మీద జిఓలు ఇస్తున్నారు తప్ప. ఆచరణలో అమలు చేయటంలేదు. మంత్రులు, ఉన్నతాధికారులు ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసిన సమస్య పరిష్కారం కాలేదు.. సమాన పనికి సమాన వేతనం చెల్లించాల్సిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కేవలం 25 శాతం వేతనాలు పెంచి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఎన్నికల కంటే ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చెయ్యాలని, సమగ్రతీక్షా సొసైటీ, కెజిబివి ఉ ద్యోగులందరికీ మినిమంటైంస్కేల్ అమలు చెయ్యాలని, సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని  డిమాండ్ చేశారు.జెఏసి రాష్ట్ర అధ్యక్షుడు ఎం.బాల కాశి మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే నవంబర్ నెలాఖరులో విద్యాశాఖా మంత్రి ఇల్లు ముట్టడి కార్యక్రమం, డిసెంబరు మొదటి వారంలో ఉద్యోగులతో సామూహిక నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు తెలియచేశారు.. ఈ కార్యాలయం ఎపి స్టేట్ గవ్నమెంట్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జెఏసి ఎవి నాగేశ్వరరావు, సంఘం ప్రధాన కార్యదర్శి బి.కాంతారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే.విజయ్, పిటిఐ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షడు సి.హెచ్. దేవేంద్ర రావు, జెఏసి నాయకులు కల్యాణి, గురువులు, గిరి శ్రీనివాసరావు, భారతి, వాసా శ్రీనివాసరావు, చంద్ర శేఖర్, వెంకట రావు, నాగ రత్నం,రోహిణి, లక్ష్మణ, పాల్గొన్నారు