Thursday, 18 June 2026

కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ భారం కాదు- అభివృద్ధికి పెట్టుబడి.. -బి.కాంతారావు నాని

https://thewiretelugu.co.in/the-regularization-of-contract-and-outsourcing-employees-is-not-a-burden-it-is-an-investment-in-development/
👆👆👆
*కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ భారం కాదు- అభివృద్ధికి పెట్టుబడి..*
 -B Kantharao Nani

ఇటీవల పంజాబ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ జరిగిన తరువాత దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చ జరుగుతోంది.

పంజాబ్ మోడల్ అనుసరించాలని కార్మిక సంఘాలు, ఉద్యోగులు కోరుతున్నారు. పంజాబ్ రాష్ట్రంలో సాధ్యమైనప్పుడు, ఇతర చోట్ల ఎందుకు సాధ్యం కావడం లేదని ప్రశ్నలను లేవనెత్తుతున్నారు.

ఈ సందర్భంగా మరింత లోతుగా ఇతర రాష్ట్రాల అనుభవాలు, ఆర్థిక గణాంకాలు, ఆధునిక ఆర్థిక సిద్ధాంతాలను పరిశీలిస్తే కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రభుత్వంపై భారం కాదని, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడే పెట్టుబడి అని స్పష్టమవుతోంది.

*👉ఆంధ్రప్రదేశ్‌లో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల దయనీయ స్థితి..*
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్, సమగ్రశిక్ష, నేషనల్ హెల్త్ మిషన్, ఉపాధిహామీ, వెలుగు, 108, 104, తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్, ఆయుష్, అర్బన్ హెల్త్, ఏపీశాక్స్ తదితర అన్ని ప్రభుత్వ పథకాలలోనూ, టీటీడీ తదితర ధార్మిక సంస్థలు, మున్సిపల్, పంచాయతీ, ఆర్టీసీ తదితర అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ సొసైటీల్లో లక్షలాది మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు.

వీరితో పాటు రెండో ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, కస్తూర్బా, కాంట్రాక్ట్ లెక్చరర్లు, పాలిటెక్నిక్ లెక్చరర్లు, ఐటీఐ కాలేజీల టీచింగ్ సిబ్బంది(టైమ్ స్కేల్, మినిమం టైమ్ స్కేల్, కంటింజెంట్, పార్ట్ టైం, కాన్సాలిడేటెడ్), మహిళా శిశు సంక్షేమం, వ్యవసాయం, రెవెన్యూ తదితర శాఖల్లో విశేష సేవలు అందిస్తున్నారు.

వీరిలో వేలాది మంది 10 నుంచి 25 సంవత్సరాలుగా నిరంతరంగా ప్రభుత్వ సేవలు అందిస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు, కార్యాలయాలు, సంక్షేమ కార్యక్రమాలు, గ్రామీణాభివృద్ధి పథకాలు నడవడంలో వీరి పాత్ర కీలకం.

అయినప్పటికీ ఉద్యోగ భద్రత, సమాన వేతనం, పెన్షన్, గ్రాట్యుటీ, పదోన్నతులు వంటి ప్రాథమిక హక్కులకు వారు ఇప్పటికీ దూరంగానే ఉన్నారు.

*👉గణాంకాలే చెబుతున్నాయి: ఇది భారం కాదు..*
రాష్ట్ర ఆర్థిక పరిమాణంతో పోల్చి చూస్తే రెగ్యులరైజేషన్‌కు అవసరమయ్యే వ్యయం పెద్దది కాదని గణాంకాలు సూచిస్తున్నాయి. 2026-27 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి సుమారు ₹19.75 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది.

రాష్ట్ర బడ్జెట్ పరిమాణం ₹3 లక్షల కోట్లకు పైగా ఉంది. ఒకవేళ రాష్ట్రంలో సుమారు 3 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని, ఒక్కో ఉద్యోగిపై సగటున నెలకు ₹20,000 అదనపు వ్యయం జరిగినా, ప్రభుత్వంపై పడే వార్షిక భారం సుమారు ₹7,200 కోట్లు మాత్రమే.

ఇది రాష్ట్ర జీఎస్‌డీపీలో కేవలం 0.36 శాతం మాత్రమే. అంటే రాష్ట్రం ఉత్పత్తి చేస్తున్న ప్రతి ₹100లో కేవలం 36 పైసలు మాత్రమే ఈ ప్రయోజనానికి ఖర్చు చేయాల్సి ఉంటుంది.

*👉ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే “మల్టిప్లయర్ ఎఫెక్ట్”..*
ఆర్థికవేత్తలు రెగ్యులరైజేషన్‌ను కేవలం వ్యయంగా చూడడం సరైన దృక్పథం కాదని చెబుతున్నారు.

ఉద్యోగుల చేతుల్లోకి వెళ్లే అదనపు ఆదాయం మార్కెట్‌లో తిరిగి ఖర్చవుతుంది.

కుటుంబాలు విద్య, వైద్యం, గృహనిర్మాణం, రవాణా, వినియోగ వస్తువుల కొనుగోళ్లపై ఎక్కువగా ఖర్చు చేస్తాయి.

ఈ అదనపు వినియోగం స్థానిక వ్యాపారాలకు ఆదాయాన్ని పెంచుతుంది. దీనివల్ల ఉత్పత్తి పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయి, ప్రభుత్వానికి జీఎస్టీ, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు, ఇంధన పన్నులు వంటి రూపాల్లో అదనపు ఆదాయం లభిస్తుంది. ఆర్థిక శాస్త్రంలో దీనిని “మల్టిప్లయర్ ఎఫెక్ట్”గా పరిగణిస్తారు.

ప్రభుత్వం ఖర్చు చేసిన ప్రతి రూపాయి ఆర్థిక వ్యవస్థలో అనేకసార్లు చలామణి అవుతూ అదనపు ఆర్థిక కార్యకలాపాలను సృష్టిస్తుంది.

*👉గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు..*
రెగ్యులరైజేషన్ వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులలో అధికశాతం మంది గ్రామాలు, చిన్న పట్టణాల్లో నివసిస్తున్నారు.

వారి ఆదాయం పెరిగితే స్థానిక దుకాణాలు, సేవారంగం, చిన్న వ్యాపారాలు బలోపేతం అవుతాయి. అప్పులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుంది. పిల్లల విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయి.

ఆరోగ్య సేవల వినియోగం పెరుగుతుంది. మొత్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక చలామణి పెరిగి స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుంది.

*👉ఆర్థిక ఉద్దీపన చర్యగా రెగ్యులరైజేషన్..*
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఎదురైనప్పుడు ప్రభుత్వాలు ప్రజల చేతుల్లోకి డబ్బు వెళ్లే విధానాలను ప్రోత్సహిస్తాయి. ఎందుకంటే వినియోగ డిమాండ్ పెరిగితేనే ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటుంది.

ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ను కూడా ఆర్థిక ఉద్దీపన చర్యగా చూడవచ్చు.

లక్షలాది కుటుంబాల కొనుగోలు శక్తి పెరగడం ద్వారా మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతుంది. అది వ్యాపారాల వృద్ధికి, పన్నుల ఆదాయం పెరుగుదలకు దోహదపడుతుంది.

*👉ఇతర రాష్ట్రాల అనుభవాలు – వాస్తవాలు..*

ఇతర రాష్ట్రాల అనుభవాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి.

హిమాచల్ ప్రదేశ్‌లో నిర్దిష్ట సేవాకాలం పూర్తయిన తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే విధానం అనేక సంవత్సరాలుగా అమలులో ఉంది.

పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించే చర్యలు చేపట్టబడ్డాయి. ఈ రాష్ట్రాలు ఆర్థికంగా వెనుకబడలేదు.

ఉద్యోగుల ఆదాయం పెరగడం వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థలు మరింత చురుకుగా మారాయి. రెగ్యులరైజేషన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే ఉదాహరణ దేశంలో ఎక్కడా కనిపించదు.

*👉కార్పొరేట్ రాయితీలు వర్సెస్ మానవ వనరుల పెట్టుబడి..*
పరిశ్రమలకు వేల కోట్ల రూపాయల రాయితీలు, భూములు, పన్ను మినహాయింపులు ఇవ్వడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉంటాయి.

కొత్త పెట్టుబడుల కోసం భారీ ప్రోత్సాహకాలు ప్రకటిస్తాయి. కానీ ఇప్పటికే ప్రభుత్వ వ్యవస్థను నడిపిస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాల్సిన సమయంలో మాత్రం ఖజానాపై భారం అనే వాదన వినిపించడం సహజంగానే ప్రశ్నలను లేవనెత్తుతోంది.

దశాబ్దాలుగా ప్రభుత్వ సేవలో ఉన్న ఉద్యోగులకు భద్రత కల్పించడం ఖర్చు కాదు, మానవ వనరులపై పెట్టుబడి.

*👉సమానత్వం – సామాజిక న్యాయం..*
సామాజిక న్యాయం కోణంలో చూసినా ఈ అంశం కీలకమైనది. ఒకే కార్యాలయంలో, ఒకే బాధ్యతలు నిర్వహిస్తున్న ఇద్దరు ఉద్యోగుల్లో ఒకరికి పూర్తి ప్రభుత్వ ప్రయోజనాలు, మరొకరికి కనీస భద్రత కూడా లేకపోవడం సమానత్వ సూత్రాలకు విరుద్ధం. దీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఉద్యోగులకు భద్రత కల్పించడం ప్రభుత్వ నైతిక బాధ్యత కూడా.

*👉సుస్థిర అభివృద్ధికి పునాది..*
ఆంధ్రప్రదేశ్ వంటి దాదాపు ₹20 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ కలిగిన రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు అవసరమయ్యే వ్యయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణంతో పోలిస్తే చాలా స్వల్పం.

కానీ ఆ నిర్ణయం వల్ల లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భద్రత, గ్రామీణ మార్కెట్లకు ఊపిరి, ప్రభుత్వానికి అదనపు పన్ను ఆదాయం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్సాహం లభించే అవకాశం ఉంది.

అందువల్ల కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ను ఖర్చుగా కాకుండా ఆర్థికాభివృద్ధికి, సామాజిక న్యాయానికి, స్థిరమైన అభివృద్ధికి దోహదపడే పెట్టుబడిగా ప్రభుత్వం పరిగణించాల్సిన అవసరం ఉంది.

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలంటే కొత్త పరిశ్రమలతో పాటు, ఇప్పటికే ప్రభుత్వ వ్యవస్థను నడిపిస్తున్న లక్షలాది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కొనుగోలు శక్తిని పెంచడం కూడా అంతే ముఖ్యం.

రెగ్యులరైజేషన్ ఉద్యోగుల డిమాండ్ మాత్రమే కాదు; అది ఆర్థికాభివృద్ధి, సామాజిక న్యాయం, పరిపాలనా స్థిరత్వానికి సంబంధించిన అంశం.

*“పరిశ్రమలకు ఇచ్చే రాయితీలను పెట్టుబడిగా చూసే ప్రభుత్వాలు, ప్రభుత్వ వ్యవస్థను భుజాన మోస్తున్న ఉద్యోగులకు కల్పించే భద్రతను కూడా పెట్టుబడిగానే చూడాలి. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ఖజానాను ఖాళీ చేయదు; కానీ లక్షల కుటుంబాల జీవితాలను స్థిరపరుస్తుంది. అదే స్థిరత్వం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి నిజమైన పునాది అవుతుంది.”*

-బి. కాంతారావు నాని, రాష్ట్ర చైర్మన్, ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్, టీచర్స్ అండ్ వర్కర్స్ జేఏసీ 9490623349
(వ్యాసం రచయిత)

Sunday, 8 March 2026

 సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మే 15 న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇల్లు ముట్టడి

                   ప్రభుత్వం తక్షణమే ఎంటిఎస్ అమలు చేయాలని జెఎసి డిమాండ్

రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం “సమగ్రశిక్షా ఉద్యోగుల సంగ్రామ సైరన్ 2.0 “చలో విజయవాడ” పేరుతో ఈరోజు విజయవాడలోని ధర్ణా చౌక్, అలంకార్ సెంటర్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో సమగ్ర శిక్షా ఉద్యోగులు హాజరై తమ సమస్యలపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించారు. ఈ ధర్నాకు రాష్ట్ర చైర్మన్ బి.కాంతారావు అధ్యక్షత వహించారు. సంవత్సరాలుగా సమగ్రశిక్షా ప్రాజెక్టులో సేవలందిస్తున్న ఉద్యోగులు తక్కువ వేతనాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం, సంక్షేమ పథకాల లోపం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని జేఏసీ నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా ఉద్యోగులు ప్రధానంగా క్రింది డిమాండ్లను ప్రభుత్వ ముందుంచారు.

1. ఎన్నికల హామీ ప్రకారం తక్షణమే మీS (వీఱఅఱఎuఎ Tఱఎవ Scaశ్రీవ) అమలు చేయాలి.

2. గౌరవ సుప్రీంకోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకొని ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి.

3. హెచ్.ఆర్ పాలసి అమలు చేసి ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత కల్పించాలి.

4. డిఎసఇ మరియు ప్రభుత్వ రెగ్యులర్ పోస్టు  నియామకాలలో మెయిటేజ్ ఇవ్వాలి.

ప్రభుత్వం వెంటనే స్పందించి సమగ్ర శిక్షా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో పోరాటాలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సమగ్రశిక్ష ఉద్యోగుల రెగ్యులర్, వేతనాలపెంపు పూర్తి బాధ్యత రా్ట ప్రరభుత్వానిదే. కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉన్నదికాబట్టి సమస్యలు పరిష్కరించుకోవడం మరింత సులభం. ఇలాంటి అవకాశాలను రాష్ట్రప్రభుత్వం వినియోగించుకొని ఉద్యోగులను రెగ్యులర్ చెయ్యాలి. సుప్రింకోర్టు కూడా 10 సం॥లు దాటిన ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణించాలని సూచించింది. ప్రతి మూడు సం॥లకొకసారి  వేతనాలు సవరించమని సుప్రింకోర్టు తీర్పును పరిగణనలోనికి తీసుకోవాలని డిమాండ్‌చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు జెఎసి రాష్ట్ర కమిటి ఎప్ప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాలు మే 10 వ తేది లోగా సమస్యలు పరిష్కరించకపోతే మే 15 వ తేది తరువాత కుటుంబసభ్యులతో సహా నారా లోకేష్ గారి ఇల్లు ముట్టడిస్తాము.

ఈ కార్యక్రమంలో ఏపి స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ రాష్ట్ర చైర్మన్ ఏ.వి.నాగేశ్వరరావు, ఫ్యాక్టో చైర్మన్ సాయి శ్రీనివాస్, ఎపిటిఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సి.హెచ్.మంజుల, ప్రధాన కార్యదర్శి  బసవలింగరావు, జెఎసి ప్రధాన కార్యదర్శి యు.కళ్యాణి, ఆర్గనైజింగ్ సెక్రటరీ జాన్‌మోడి, రాష్ట్ర జెఎసి నాయకులు రఫీ, వాసా శ్రీనివాసరావు, గంగాధర్, శ్రీరాంమూర్తి, జయరాజ్, వినోద్, దిలీప్, నాగార్జున, ప్రశాంతి, నాగేశ్వరరావు, పండు, ఎల్.బి.రమణ, ఈశ్వరరావు, ఓబిరెడ్డి, అంజి, రామన్న, వెంకటరమణ, అనీల్, వసుంధర, మునికష్ణ, చంద్రశేఖర్, విజయ్‌బాబు, రాధాకష్ణ, మహాలక్ష్మి, సంతోష్, గుంటూరు బాషా, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.















Sunday, 15 June 2025

కార్మిక చట్టాల సవరణ ఎవరి ప్రయోజనాలు కోసం?


కార్మిక చట్టాల సవరణ ఎవరి ప్రయోజనాల కోసం?*కేంద్రంలో మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం తెచ్చిన లేబర్‌ కోడ్స్‌కు వత్తాసు పలుకుతూ రాష్ట్రంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కార్మిక చట్టాలకు సవరణలు చేసింది. కార్మికుల హక్కులకు నష్టం కలిగించడంలో వీరిద్దరిదీ ఒకే వైఖరి అని మరో సారి తేటతెల్లమైంది. అనేక సంవత్సరాలు కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలకు తూట్లు పొడుస్తూ పాలకులు ఈ విధానాలు తెచ్చారు. యజమానులు తమ వ్యాపారాలను తేలిగ్గా చేసుకునేందుకు ఈ మార్పులు తెస్తున్నామని కేంద్ర, రాష్ట్ర పాలకులు నిస్సిగ్గుగా చెబుతున్నాయి. దీనిపై ఇక తేల్చుకోవాల్సింది కార్మిక వర్గమే. పోరాడి సాధించుకున్న చట్టాలను తిరిగి ఐక్య పోరాటాల ద్వారానే నిలబెట్టుకోవాలి. కేంద్ర, రాష్ట్ర పాలకుల కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలి.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పని గంటలు, విశ్రాంతి, రాత్రి పూట పని చేయించడం తదితర అంశాల్లో చట్టాలకు తూట్లు పొడుస్తూ మార్పులు చేసింది. ”ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌” అమలు కోసం, యజమానులు తమ వ్యాపారాలను తేలిగ్గా చేసుకునేందుకు ఈ మార్పులు తెస్తున్నామని ప్రెస్‌ మీట్‌లో గౌరవ మంత్రివర్యులు ప్రకటించారు. ఈ సవరణలను పరిశ్రమలు, సంస్థలపై ప్రస్తుతం ఉన్న చట్టాల అమలు వల్ల కలిగే విధానపరమైన భారాన్ని తగ్గించడానికేనని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా తమ పెట్టుబడిదారీ వర్గ అనుకూల ధోరణిని బయటపెట్టారు. ఈ మార్పుల వలన రాష్ట్రంలోని ఫ్యాక్టరీలు, షాపులు, సంస్థల్లో పని చేసే 50 లక్షల మంది కార్మికులు నష్టపోతారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గత 13 సంవత్సరాలుగా షెడ్యూల్డ్‌ ఎంప్లారుమెంట్స్‌లో కనీస వేతనాల సవరణ చేయకపోవడం వలన వీరంతా ఆర్థిక దోపిడీకి గురవుతున్నారు. ఈ సవరణల ద్వారా మరింత దోపిడీకి గురవుతారు. ఆ మేరకు యాజమాన్యాలు లాభపడతాయి. స్కీమ్‌ వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయడం లేదు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు మినిమం టైమ్‌ స్కేల్‌ అమలు చేయడం లేదు. వీరెవరికీ సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. దాదాపు 50 లక్షల మందిగా ఉన్న భవన నిర్మాణం, హమాలీ, ఆటో, ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్టు, షాప్‌ ఎంప్లాయీస్‌ తదితర అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత సౌకర్యాలు అమలు కావడం లేదు. వీటిని పట్టించుకోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నేడు యాజమాన్యాల సౌలభ్యం కోసం ఈ మార్పులు తేవడం సరైనది కాదు. ఎన్నికల ముందు కార్మిక సంక్షేమం, సామాన్య ప్రజానీకం గురించి మాట్లాడి ఓట్లు వేయించుకున్న తెలుగుదేశ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఈ మార్పులు తెచ్చింది. వీటికి వ్యతిరేకంగా జులై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో సంఘాలకు అతీతంగా కార్మికవర్గం పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసనను తెలపాలి.ఫ్యాక్టరీల చట్టం సెక్షన్‌ 54ను సవరించి ప్రస్తుతం విరామంతో సహా ఉన్న 9 గంటల పనిని 10 గంటలకు పెంచాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. ఏపీ షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ చట్టంలో షాపులకు సంబంధించి సెక్షన్‌ 9, సంస్థలకు సంబంధించి సెక్షన్‌ 16ను సవరించి అవసరాన్ని, సీజన్‌ను బట్టి రోజుకు 8 గంటల పనిని 10 గంటల వరకూ పెంచవచ్చన్నారు.వారంలో పని గంటలు 48 గానే యథాతథంగా ఉంటాయని (రోజుకు 8 గంటలు ఞ 6 రోజులు), చెబుతున్నా ఆచరణలో కార్మికుడిపై పని గంటలు, పని భారం పెరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న రోజుకు 8 గంటల పనిని మార్చే హక్కు ప్రభుత్వానికి లేదు. 8 గంటల పనిని డబుల్‌ వేతనంతో ఓటి చేయించుకోవాలన్నా కూడా కార్మికుడి రాతపూర్వక ఒప్పందం ఉండాలి. ఇదేదీ లేకుండా రోజువారీ పని గంటల్లో ఏకపక్షంగా పై మార్పులు చేయడం యాజమాన్యాల ప్రయోజనం కోసమే.ఫ్యాక్టరీల చట్టం సెక్షన్‌ 55, ఏపీ షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ చట్టంలో షాపులకు సెక్షన్‌ 10, సంస్థలకు సెక్షన్‌ 17లను సవరించి 5 గంటల పని అనంతరం విరామం పొందేందుకు ప్రస్తుతం ఉన్న అవకాశాన్ని 6 గంటల పాటు పని చేసిన తర్వాత మాత్రమే విరామం ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఇది కార్మికుడి ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుంది. ఆరోగ్య సూత్రాల ప్రకారం ప్రతి 3 గంటలకోసారి అల్పాహారమో / పూర్తి ఆహారమో / తేనీయాలో తీసుకోవాలి. దాన్ని కూడా ఈ సవరణల ద్వారా నిరాకరించడం అమానుషం.ఫ్యాక్టరీల చట్టం సెక్షన్‌ 56లో భోజన విరామం, ముందుగా తెలియని / నిరోధించలేని ఏదైనా అత్యవసర పరిస్థితులలో కార్మికుని 8 గంటల పనిని 10.30 గంటల్లో విస్తరించవచ్చన్న నియమాన్ని సవరించి ఇప్పుడు 12 గంటలుగా మార్చారు. అంటే అంతకు ముందు అవాంతరాలతో కలిపి 2.30 గంటలుగా ఉన్న విరామం ఇప్పుడు 4 గంటలుగా మారుతుంది. అలాగే షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ చట్టంలో షాపులకు సంబంధించి సెక్షన్‌ 11, సంస్థలకు సంబంధించి సెక్షన్‌ 18లో ఉన్న అన్ని విరామాలతో కలిపి 8 గంటల పనిని 12 గంటల్లో విస్తరించవచ్చన్న నియమం కొనసాగుతుంది. పని గంటలు పెరిగినా విరామాలతో కలపి 12 గంటలు మించవన్న లేబర్‌ కమిషనర్‌ వివరణ అంగీకరించరానిది. ఒకవైపు విరామాన్ని గంట పెంచడం మరియు 8 గంటల పని విస్తరణను మరో 2 గంటలు పెంచడం వలన కార్మికులు నష్టపోతారు. తమ కుటుంబాలతో గడపడానికో / ఇంటి వద్ద విశ్రాంతి తీసుకోవాడానికో వినియోగించాల్సిన కాలాన్ని ఫ్యాక్టరీలో వెచ్చించాల్సి వస్తుంది. ఆ మేర కార్మికులకు మానసికంగా ఇబ్బంది కలుగుతుంది.గతంలో ప్రతి మూడు నెలలకు 50 నుండి 75 గంటలు అదనంగా కార్మికుని రాతపూర్వక అనుమతితో ఓటి చేయించుకోవచ్చు. ఇప్పుడు ఆ ఓటి కాలాన్ని 144 గంటలకు పెంచారు. దీని వలన కార్మికునిపై పని భారం, పని ఒత్తిడి పెరుగుతాయి. కొత్త వారికి ఉపాధి తగ్గుతుంది. ఈ మేరకు యాజమాన్యాలు లాభపడ్డానికే ఈ ప్రతిపాదన తెచ్చారు.ఫ్యాక్టరీల చట్టంలోని సెక్షన్‌ 66 ప్రకారం మహిళా కార్మికులతో రాత్రి 7 గంటల తర్వాత, ఉదయం 6 గంటల్లోపు పని గంటల్లో నియమించకూడదు. అయితే ఈ సెక్షన్‌ ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉందని గతంలో చాలా రాష్ట్రాల్లో హైకోర్టులు కొట్టేశాయి. మహిళలకు కూడా పని ప్రాథమిక హక్కుగా కల్పించాలనే ఉద్దేశంతో కోర్టులు మహిళలకు తగిన భద్రత, రవాణా, ఇతర సౌకర్యాలు కల్పించి వారి అంగీకారంతో రాత్రి షిఫ్టుల్లో పని చేయించుకోవాలని తీర్పులిచ్చాయి. మహిళా సంఘాలు కూడా ఈ పని హక్కుకు మద్దతునిచ్చాయి. 2015, 2022లో డైరెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు తీర్పుకు అనుగుణంగా యజమాని తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ పేర్కొంటూ సర్క్యులర్‌ను (25.10.2022న) జారీ చేశారు. ఆ నిబంధనల ప్రకారం మహిళా కార్మికులు రాతపూర్వకంగా అంగీకారం తెలపాలి. ప్రసూతి సెలవు నిబంధనలకు లోబడి మాత్రమే పని చేయించాలి. పనికి వచ్చేటప్పుడు, తిరిగి వెళ్లేటప్పుడు ట్రాన్స్‌పోర్ట్‌ సౌకర్యం కల్పించాలి. పని ప్రదేశాల్లో టాయిలెట్లు, మంచినీరు, రక్షణ, తదితర సౌకర్యాలన్నీ కల్పించాలి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. లైంగిక వేధింపుల చట్టం అమలు చేయాలి. కానీ చాలా ప్రదేశాల్లో ఇవేవీ అమలు కాని పరిస్థితి ఉన్నది. ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షణే లేదు. పెట్టుబడిదారులకు అనుకూలంగా నయా ఉదారవాద విధానాలు అవలంభిస్తున్న కేంద్ర, రాష్ట్ర పాలకులు వీటి పర్యవేక్షణకు తగిన యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయని దుస్థితి నేడు నెలకొంది. ఫ్యాక్టరీల్లో వరుస ప్రమాదాలు జరిగి కార్మికులు, ప్రజలు చనిపోతున్నా పట్టించుకోని పరిస్థితి మన కళ్ల ముందుంది. ఈ నేపథ్యంలో మహిళలకు పూర్తి రక్షణ కల్పించి రాత్రిపూట పని చేయించుకోవాలని ప్రభుత్వం ప్రకటించినా ఆ చరణలో దానికి తగ్గ ఏర్పాట్లు నేడు రాష్ట్రంలో లేవు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర క్యాబినెట్‌ ఈ సవరణ చేయడం దుర్మార్గం. పై నిబంధనలన్నింటి అమలు గ్యారంటీ చేశాకే, దానికి తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకుండా ఈ నిర్ణయం సరైనది కాదు.పై సవరణలతో పాటు ఇప్పటికే రాష్ట్రంలో లేబర్‌ కోడ్స్‌కు అనుగుణంగా పారిశ్రామిక వివాదాల పరిష్కారం కోసం కార్మికులు దరఖాస్తు చేసుకోవాల్సిన కాలాన్ని మూడు సంవత్సరాల నుండి రెండు సంవత్సరాలకు తగ్గించారు. మూడు సంవత్సరాల కాలం అయితే వివాదాలు పెరుగుతున్నాయని, ఇవి తగ్గడానికంటూ రెండు సంవత్సరాలకు కుదించింది. కార్మికులు సమ్మె చేయాలంటే అత్యవసర సర్వీసుల్లో 14 రోజుల ముందు నోటీసునివ్వాలి. దీన్ని అత్యవసరం కాని సేవల్లో కూడా ఈ 14 రోజుల నోటీసునివ్వాలని సవరణలు తెచ్చారు. జరిమానాలకు సంబంధించి యాజమాన్యాలు చిన్నపాటి జరిమానాలతో తప్పించుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ చట్టం సవరించారు. చట్టాల ఉల్లంఘనపై యాజమాన్యాలపై కోర్టులకు వెళ్లకుండా, వారు ఇబ్బందులు పడకుండా అప్పటికప్పుడు చిన్నపాటి జరిమానాలు కట్టి తప్పించుకునేలా వెసులుబాటు కల్పించారు.కనీసం కార్మిక సంఘాలతో కూడా చర్చించకుండా ఈ ప్రతిపాదనలు రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదించడం దుర్మార్గం. పూర్తిగా కార్మిక వ్యతిరేకమైన ఈ ప్రతిపాదనలు వెంటనే ఉపసంహరించుకునేలా కార్మికవర్గం ఐక్యంగా పోరాడాలి. వామపక్షాలు అధికారంలో ఉన్న కేరళ మినహా కేంద్రంలో, మనతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక సవరణలు చేయడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారింది. కర్ణాటకలో అంతకు ముందున్న బిజెపి ప్రభుత్వం వారపు పనిగంటలు 48 గానే ఉంచి, రోజువారీ పని గంటలను అవసరాన్ని బట్టి పెంచుకోవడమో లేదా తగ్గించుకోవడమో చేయవచ్చని చట్టాన్ని మార్చింది. ప్రస్తుత ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తోంది. ఆ బాటలోనే నేడు తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పయనిస్తోంది. కేంద్రంలో బిజెపి కార్మిక చట్టాల సవరణలతో తెచ్చిన లేబర్‌ కోడ్స్‌కు పార్లమెంట్‌లో తెలుగుదేశం, వైసిపి లు అమోదం తెలిపాయి. పార్లమెంట్‌లో వామపక్షాలు వ్యతిరేకించాయి. కార్మిక హక్కులను హరించడంలో మిగిలిన పార్టీల విధానం ఒక్కటే. దీన్ని కార్మికవర్గం గమనించాలి. వీటికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలి. ఈ సవరణలను తిప్పి కొట్టాలి. జులై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను రాష్ట్రంలో జయప్రదం చేయాలి. జులై 9న పెద్ద ఎత్తున అన్ని మండలాలు, పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో వేలాదిగా నిరసనలు తెలపాలి.-వ్యాసకర్త : ఎ.వి. నాగేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు

Thursday, 14 November 2024

రాష్ట్ర అధికారులను కలసిన జెఎసి రాష్ట్ర కమిటీ

మంత్రి నారా లోకేష్ గారిని కలిసిన జెఎసి నాయకులు

పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు (ఐవి) ఆధ్వర్యంలో గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని కలిసిన జెఎసి రాష్ట్ర నాయకత్వం.. సమ్మె కాలపు జీతం విడుదల పై మంత్రిగారికి ధన్యవాదాలు తెలిపారు. హెచ్.ఆర్ పాలసీ వర్తింప చేయాలని, మినిమం ఆఫ్ టైం స్కేల్ అమలుచేయాలని, ఇతర విషయాలు పైన వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జెఎసి గౌరవ అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు, రాష్ట్ర చైర్మన్ కాంతారావు నాని, జనరల్ సెక్రటరీ కల్యాణి, ఆర్గనైజేషన్ సెక్రటరీ జాన్ మోడీ, కో-చైర్మన్లు డా.బోమ్మిడి నాగరాజు, మహమ్మద్ రఫీ, వైస్ చైర్మన్ వాసా శ్రీనివాస్, ఏలూరు జిల్లా నాయకులు బాలాజీ, బాపట్ల జిల్లా నాయకులు వీరాంజనేయులు పాల్గొన్నారు.

Friday, 5 July 2024

*గౌరవ విద్యా శాఖ మంత్రి గౌరవ నారా లోకేశ్ గారిని, గౌరవ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ IAS గారిని, ఎస్పిడీ గారికి కలిసిన జేఏసీ గౌరవ అధ్యక్షులు ఏ.వి.నాగేశ్వరరావు గారు. సమ్మె కాలపు జీతం, సమ్మె అగ్రిమెంట్స్ హెచ్ఆర్ పాలసీ కమిటీల MTS అమలు, పెండింగ్ వేతనాలు పైన గౌరవ మంత్రి శ్రీ నారా లోకేశ్ గారికి, ప్రిన్సిపాల్ సెక్రటరీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. పెండింగ్ వేతనాలు ఈ వారంలో వేస్తామని ఇతర సమస్యలు మరికొద్ది రోజులల్లో పరిష్కరిస్తామని గౌరవ మంత్రి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు హామీ ఇచ్చారు**-kantharao Nani**రాష్ట్ర చైర్మన్*

date 05.07.2024 జేఏసీ సెక్రటరీ జనరల్ యు.కళ్యాణి , వైస్ చైర్మన్ వాసా శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ రవీంద్ర బాబు నాయకత్వంలో జెఎసి ప్రతినిధి బృందం ఈరోజు గౌరవ విద్యా శాఖ మంత్రి శ్రీ నారా లోకేశ్ గారిని కలిసి పెండింగ్ వేతనాలు, సమ్మె కాలం జీతం, ఇతర సమస్యల పైన వినతి పత్రం ఇచ్చారు.**👉అనంతరం సెక్రటేరియట్ లో ఉన్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అడిషనల్ డైరెక్టర్ గారిని, అసిస్టెంట్ డైరెక్టర్ గారిని కలిసి సమగ్ర శిక్షా ఉద్యోగులకు జీతాలకు సంబంధించి బడ్జెట్ తక్షణమే విడుదల చేయాలని కోరారు.**👉 గౌరవ మంత్రి శ్రీ నిమ్మల రాము నాయుడు గారిని కలిసి సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యల పైన వినతిపత్రం ఇచ్చారు.. సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.**👉 సాయంత్రం గౌరవ ఎస్పిడి గారిని కలిసి పెండింగ్ వేతనాలు, సమ్మెకాలపు జీతం చెల్లింపు పై వినతిపత్రం ఇచ్చారు..బడ్జెట్ త్వరగా రావడానికి కోసం ప్రయత్నం చేస్తున్నామని ఎస్పీడీగా తెలియజేశారు. సమ్మె కాలం జీతం, సమ్మె అగ్రిమెంట్ మినిట్స్ లో ఉండే అంశాలను పై గౌరవ మంత్రి గారితో చర్చించి పది రోజుల్లో పరిష్కారం చేస్తామని గౌరవ SPD గారు తెలియజేశారు.**👉 సమగ్ర శిక్షా స్టేట్ ఫైనాన్స్ కంట్రోల్ ఆఫీసర్ గారిని కలిసి జీతాలు బడ్జెట్ విడుదల చేయుటకు చొరవ తీసుకోవాలని కోరారు.**ఈ టీంలో ఈ ముగ్గురితోపాటు, రాజమండ్రి జేఏసీ నాయకులు రామ్మోహన్, ఏలూరు జిల్లా జెఎసి నాయకులు బాలాజీ, ప్రకాశం జిల్లా నాయకులు కిరణ్, వెంకటేష్ వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులు ఉన్నారు.ఈ విషయాన్ని మన సభ్యులందరికీ తెలియజేయండి.*💐💐💐*-కాంతారావు నాని**రాష్ట్ర చైర్మన్*

Wednesday, 26 June 2024

తేది 26.06.2024 | కుప్పం పర్యటనలో ఉన్న గౌరవ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలసిన చిత్తూరు జిల్లా సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు. ఉద్యోగ భద్రత, రెగ్యులర్, MTS,HR policy అమలు, పెండింగ్ వేతనాలు పై వినతిపత్రం సమర్పించారు.

తేది 19.06.2024 | గౌరవ విద్యా శాఖా మంత్రి శ్రీ నారా లోకేశ్ గారిని కలసి శుభాకాంక్షలు తెలియచేసిన జెఎసి రాష్ట్ర కమిటీ. సమస్యలు పై వినతిపత్రం ఇచ్చిన జెఎసి రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు కాంతారావు నాని, రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు. గౌరవ మంత్రి గారు సానుకూలంగా స్పందించారు.

Thursday, 3 November 2022

కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ ఎప్పుడు?



ఒడిషాలో 57 వేల మంది, రాజస్థాన్‌లో 1,10,279 మంది, పంజాబ్‌లో 28 వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులను అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు రెగ్యులరైజ్‌ చేశాయి. తెలంగాణ రాష్ట్రంలోనూ ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కాని ఏపి లో ఎన్నికల ముందు కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌, సమాన పనికి సమాన వేతనాలంటూ ఊరించిన వైసిపి...తీరా ప్రభుత్వం ఏర్పడ్డాక ఇచ్చిన హామీలను అటకెక్కించింది.

*అమలు కాని హామీలు*
'మాట తప్పను, మడమ తిప్పను' అన్నారు వైసిపి నేత జగన్‌ మోహన్‌ రెడ్డి. అయితే ఆయన నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వేతనాల విషయంలో, రెగ్యులరైజేషన్‌ విషయంలో మాట తప్పింది. మడమ తిప్పుతోంది. రాష్ట్రంలో 2,45,000 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, 60 వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు అనేక సంవత్సరాలుగా సేవలందిస్తున్నారు. అందరికీ సమాన పనికి - సమాన వేతనం అన్న జగన్‌ మోహన్‌ రెడ్డి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు 2005 నుండీ అమలయిన పద్ధతులకు పాతరేసి అతి తక్కువ వేతన పెంపుతో చేతులు దులుపుకొన్నారు. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు రెగ్యులర్‌ ఉద్యోగుల బేసిక్‌కు సమానంగా వేతనాల అమలుతో వైఎస్‌ రాజశేఖరరెడ్డి కాలంలో ఇచ్చిన జీవో3 కు తిలోదకాలిచ్చారు. రెగ్యులర్‌ ఉద్యోగుల కనీస బేసిక్‌కు సమానంగా కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు అమలు చేయాలని సివిల్‌ అప్పీల్‌ 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అమలు చేయకుండా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు అన్యాయం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రెగ్యులరైజేషన్‌ విషయంలోనూ పొంతన లేని కబుర్లు చెబుతున్నది.

*హామీల అమలెప్పుడు?*
సాధ్యమైనంత ఎక్కువ మందిని త్వరలోనే రెగ్యులరైజ్‌ చేస్తామని సెక్రటేరియట్‌ సాక్షిగా గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించి 3 సంవత్సరాలైంది. నేటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా ఉంది. రెగ్యులరైజేషన్‌కు 11 వేల మందికే అర్హత ఉందంటూ కొంత మంది అమాత్యులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. గత 20 సంవత్సరాలుగా సేవలందిస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సంఖ్యకు, వీరి లెక్కలకు ఎక్కడా పొంతనే లేదు.

*మారని ప్రభుత్వాల విధానాలు*
ఏళ్ళ తరబడి పని చేయించుకోవడమే కాని కనీసం పనిచేస్తున్న వారి లెక్కనూ సరిగ్గా చెప్పలేకపోవడం మన రాష్ట్రానికే చెల్లింది. 2002 నుండీ నేటి వరకూ పరిపాలన వెలగబెట్టిన పార్టీలన్నీ చాలీచాలని వేతనాలతో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల చేత ఊడిగం చేయించుకుంటున్నాయి. పని చేయడానికి పనికి వచ్చే కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు రెగ్యులరైజేషన్‌కు ఎందుకు అర్హులు కారు? పాలన సాగిస్తున్న పార్టీలు మారుతున్నాయే కాని, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పట్ల వీటి విధానాలు మాత్రం ఒక్కటే. ఈ విషయం ఉద్యోగులు గ్రహించాలి. ఒడిషా తరహాలో సుదీర్ఘ పోరాటానికి సన్నద్ధం కావాలి. ఈ పార్టీల విధానా లపై సమర శీలంగా ఐక్యంగా పోరు సల్పాలి.

*మూడు రాష్ట్రాల్లో రెగ్యులరైజేషన్‌*
ఒడిషాలో ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి తమకు ఇచ్చిన హామీ ప్రకారం రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు దశల వారీగా పోరాటాలు నిర్వహించారు. రెండు నెలల పాటు పోరాటాలను ఉధృతం చేశారు. వేలాది మంది ఐక్యంగా ఆందోళనలు నిర్వహించారు. తమ కుటుంబ సభ్యులను, పిల్లలను కూడా పోరాటాల్లో భాగస్వాములను చేశారు. కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు వారికి సహకారం అందించాయి. దాంతో దాదాపు 57 వేల మందిని రెగ్యులరైజ్‌ చేస్తూ ఒడిషా లోని నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం నిర్ణయించింది. వీరందర్నీ రెగ్యులరైజ్‌ చెయ్యడానికి మార్గాన్ని సుగమం చేస్తూ ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం 2022 అక్టోబర్‌ 16న నోటిఫికేషన్‌ ఇచ్చింది. రూల్స్‌ను ఆ నోటిఫికేషన్‌లో పొందుపరిచింది. నియమితులైన వారందరూ రెగ్యులర్‌ పోస్టులో నియమించిన వారిగా పరిగణించబడతారని పేర్కొంది. గ్రూప్‌-బి, గ్రూప్‌-సి, గ్రూప్‌-డి పోస్టుల్లో కాంట్రాక్ట్‌ పద్ధతిపై నియమించబడిన వారందరికీ రూల్స్‌ను రూపొందించింది. ఆ రూల్స్‌లో పాయింట్‌ 4(2) ప్రకారం వేతనాలు, నోషనల్‌ ఇంక్రిమెంట్లను...వారు కాంట్రాక్టు సర్వీసులో జాయిన్‌ అయిన తేదీని బట్టి నిర్ణయిస్తారు. పాయింట్‌ 4(3) ప్రకారం 6 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న వారందరికీ వారు జాయిన్‌ అయిన తేదీ నుండి పే ఫిక్స్‌ చెయ్యబడుతుంది. పాయింట్‌ 4(4) ప్రకారం వారికి సర్వీసు బెనిఫిట్లు, ప్రమోషన్లు, పాయింట్‌ 4(5) ప్రకారం వారి కేడర్‌లో సీనియార్టీ వంటివన్నీ పరిగణించబడతాయి.
రాజస్థాన్‌లో విద్య, పంచాయితీరాజ్‌ తదితర శాఖల్లో 1,10,279 మంది కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులరైజ్‌ చేసే నిర్ణయాన్ని ముఖ్యమంత్రి దీపావళి సందర్భంగా ప్రకటించారు. రాజస్థాన్‌ లోనూ వివిధ శాఖల్లోని ఉద్యోగులు రెగ్యులరైజేషన్‌కై ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రాజస్థాన్‌ ప్రభుత్వం ''రాజస్థాన్‌ కాంట్రాక్ట్‌ హైరింగ్‌ టు సివిల్‌ పోస్టు రూల్స్‌-2022''ను అమలు చేసే ప్రతిపాదనను ఆమోదించింది. రాష్ట్రంలోని వివిధ శాఖల కాంట్రాక్ట్‌ కార్మికులందరికి ఈ నిబంధనలను వర్తింపచేస్తామని, వారి సామాజిక భద్రతపై ప్రభుత్వం శ్రద్ధ తీసుకొంటుందని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ప్రకటించారు.
పంజాబ్‌లో నూతనంగా ఏర్పడిన ఆప్‌ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే సిపిఎస్‌ రద్దు చేసింది.

*ఐక్యంగా పోరాడదాం*
కాని మన రాష్ట్రంలో ఆ పరిస్థితి కనుచూపు మేరలో కనబడటం లేదు. ఎన్నికలకు ముందు ప్రజాసంకల్ప యాత్రలో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలను నేటికీ అమలు చెయ్యలేదు. ఈ విషయంలో వైసిపి ప్రభుత్వానికి జీరో మార్కులే వచ్చాయి. ఆప్కాస్‌ వల్ల ప్రైవేట్‌ కాంట్రాక్టర్‌ బదులుగా ప్రభుత్వ కాంట్రాక్టర్‌ మాత్రమే వచ్చారు. ఒడిషా ఉద్యోగుల పోరాట స్ఫూర్తితో ఏ.పి లోని కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులంతా శాఖలు, కేడర్లు పక్కనబెట్టి ఐక్యంగా ముందుకు సాగాలి. ఐక్య పోరాటాలు సుదీర్ఘ కాలం సాగించడానికి సన్నద్ధం కావాలి. సమస్యలు పరిష్కారం అయ్యేదాకా సమరశీలంగా ఐక్యంగా పోరాడాలి.

వ్యాసకర్త : ఏ.వి. నాగేశ్వరరావు, రాష్ట్ర చైర్మన్
ఎపి స్టేట్ గవ్నమెంట్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్,టీచర్స్ అండ్ వర్కర్స్ జెఏసి,
సెల్‌ : 9490098031 /

Thursday, 13 October 2022

సమగ్ర శిక్షా సొసైటీ, కెజిబివి ఉద్యోగులకు మినిమం టైంస్కేల్ అమలు చెయ్యాలి

సమగ్ర శిక్షా సొసైటీ, కెజిబివి ఉద్యోగులకు మినిమం టైంస్కేల్ అమలు చెయ్యాలిఎస్పిడి కార్యాలయం వద్ద రాష్ట్ర స్థాయి ధర్నా సమగ్ర శిక్షా సొసైటీ, కెజిబివి లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, పార్ట్ టైం పద్ధతిలో పనిచేస్తున్న అన్ని కేడర్లకు 25 వేల మంది ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జిఓ నెం 5 ప్రకారం మినిమం టైంస్కేల్: సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని, రద్దు చేసిన ఆర్ట్ క్రాఫ్ట్ పోస్టులను ప్రభుత్వం పునరుద్ధరించాలని డిమాండ్ సెప్టెంబర్ 30వ తేదీన విజయవాడలోని స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర స్థాయి ధర్నా కార్యక్రమం సమగ్ర శిక్షా  ఉద్యోగుల జెఎసి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఎస్ఎస్ఎ ఉద్యోగుల ఆందోళనకు మద్దతుగా ఈ కార్యక్రమంలో పిడిఎఫ్ కే.ఎస్. లక్ష్మణరావు, షేక్ సాబ్జి, ఐ.వెంకటేశ్వరరావు ఎంఎల్సీలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కే.ఎస్. లక్ష్మణ రావు మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్నికల కంటే ముందు ప్రతిపక్షనేతగా సమగ్ర శిక్షా ఉద్యోగులకు మినిమం టైంస్కేల్, సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగభద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి 3 సం॥లు అవుతున్నా ఒక్క హామీ కూడా అమలు కాలేదు.. తక్షణమే వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మాట్లాడుతూ 2019లో ప్రభుత్వం సమగ్ర శిక్షా ఉద్యోగులకు, కెజిబివి సిబ్బందికి మినిమం టైంస్కేల్ ఇవ్వాలని జిఓ నెం. 24 ఇచ్చింది. ఆ జిఓను ప్రస్తుత ప్రభుత్వం అమలు చెయ్యకుండా 2020 లో జిఓ నెం 40 ని ఇస్తూ మినిమం టైంస్కేల్ అమలు చేస్తామని పేర్కొంది. ఈ జిఓ కూడా అమలు చెయ్యకుండా గత సంవత్సరం లో జిఓ నెం. 5 ను ప్రభుత్వం విడుదల చేసింది. జిఓ నెం. 5 ప్రకారం సమగ్రశిక్ష సొసైటీ, కెజిబివి ఉద్యోగులతో ఎంటిఎస్ అమలవుతుందనే ఎంతో ఆశతో ఎదురుచూసిన ఉద్యోగులకు నిరాశే మిగిలింది అన్నారు.ఎమ్మెల్సీ ఐ. వెంకటేశ్వరావు మాట్లాడుతూ సమగ్రశిక్షా సొసైటీ, కెజిబివి ఉద్యోగులకు 2017 లో గత తెలుగుదేశం ప్రభుత్వంలో పెరిగిన వేతనాల తోటే నేటీకి బ్రతుకుతున్న పరిస్థితి. ప్రస్తుత ప్రభుత్వం మినిమం టైంస్కేల్ అమలు చేస్తామని జిఓ లు మీద జిఓలు ఇస్తున్నారు తప్ప. ఆచరణలో అమలు చేయటంలేదు. మంత్రులు, ఉన్నతాధికారులు ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసిన సమస్య పరిష్కారం కాలేదు.. సమాన పనికి సమాన వేతనం చెల్లించాల్సిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కేవలం 25 శాతం వేతనాలు పెంచి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఎన్నికల కంటే ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చెయ్యాలని, సమగ్రతీక్షా సొసైటీ, కెజిబివి ఉ ద్యోగులందరికీ మినిమంటైంస్కేల్ అమలు చెయ్యాలని, సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని  డిమాండ్ చేశారు.జెఏసి రాష్ట్ర అధ్యక్షుడు ఎం.బాల కాశి మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే నవంబర్ నెలాఖరులో విద్యాశాఖా మంత్రి ఇల్లు ముట్టడి కార్యక్రమం, డిసెంబరు మొదటి వారంలో ఉద్యోగులతో సామూహిక నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు తెలియచేశారు.. ఈ కార్యాలయం ఎపి స్టేట్ గవ్నమెంట్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జెఏసి ఎవి నాగేశ్వరరావు, సంఘం ప్రధాన కార్యదర్శి బి.కాంతారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే.విజయ్, పిటిఐ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షడు సి.హెచ్. దేవేంద్ర రావు, జెఏసి నాయకులు కల్యాణి, గురువులు, గిరి శ్రీనివాసరావు, భారతి, వాసా శ్రీనివాసరావు, చంద్ర శేఖర్, వెంకట రావు, నాగ రత్నం,రోహిణి, లక్ష్మణ, పాల్గొన్నారు


Wednesday, 20 April 2022

సజ్జల ను కలసి వినతి పత్రం అందచేసిన బాలకాశి

సమగ్ర శిక్షా ఉద్యోగులకు మినిమం ఆఫ్ టైం స్కేల్ చేయాలని కోరుతూ... గౌరవ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలసి, వినతిపత్రం ఇచ్చి జెఏసి రాష్ట్ర అధ్యక్షుడు ఎం.బాలకాశి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.విజయ్.. MTS అమలుకు అడ్డంకిగా ఉన్న నిబంధనలు సవరించాలని కోరడం జరిగింది... ఉద్యోగులల్లో ఉన్న తీవ్ర అసంతృప్తి, ఆవేదనను సజ్జల గారికి తెలియచేయడం జరిగింది..* *ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తానని సజ్జల గారు హామీ ఇచ్చారు..*

*-ఎం.బాలకాశి,*
*రాష్ట్ర అధ్యక్షుడు*