సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మే 15 న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇల్లు ముట్టడి
ప్రభుత్వం తక్షణమే ఎంటిఎస్ అమలు చేయాలని జెఎసి డిమాండ్
రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం “సమగ్రశిక్షా ఉద్యోగుల సంగ్రామ సైరన్ 2.0 “చలో విజయవాడ” పేరుతో ఈరోజు విజయవాడలోని ధర్ణా చౌక్, అలంకార్ సెంటర్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో సమగ్ర శిక్షా ఉద్యోగులు హాజరై తమ సమస్యలపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించారు. ఈ ధర్నాకు రాష్ట్ర చైర్మన్ బి.కాంతారావు అధ్యక్షత వహించారు. సంవత్సరాలుగా సమగ్రశిక్షా ప్రాజెక్టులో సేవలందిస్తున్న ఉద్యోగులు తక్కువ వేతనాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం, సంక్షేమ పథకాల లోపం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని జేఏసీ నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా ఉద్యోగులు ప్రధానంగా క్రింది డిమాండ్లను ప్రభుత్వ ముందుంచారు.
1. ఎన్నికల హామీ ప్రకారం తక్షణమే మీS (వీఱఅఱఎuఎ Tఱఎవ Scaశ్రీవ) అమలు చేయాలి.
2. గౌరవ సుప్రీంకోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకొని ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి.
3. హెచ్.ఆర్ పాలసి అమలు చేసి ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత కల్పించాలి.
4. డిఎసఇ మరియు ప్రభుత్వ రెగ్యులర్ పోస్టు నియామకాలలో మెయిటేజ్ ఇవ్వాలి.
ప్రభుత్వం వెంటనే స్పందించి సమగ్ర శిక్షా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో పోరాటాలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సమగ్రశిక్ష ఉద్యోగుల రెగ్యులర్, వేతనాలపెంపు పూర్తి బాధ్యత రా్ట ప్రరభుత్వానిదే. కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉన్నదికాబట్టి సమస్యలు పరిష్కరించుకోవడం మరింత సులభం. ఇలాంటి అవకాశాలను రాష్ట్రప్రభుత్వం వినియోగించుకొని ఉద్యోగులను రెగ్యులర్ చెయ్యాలి. సుప్రింకోర్టు కూడా 10 సం॥లు దాటిన ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణించాలని సూచించింది. ప్రతి మూడు సం॥లకొకసారి వేతనాలు సవరించమని సుప్రింకోర్టు తీర్పును పరిగణనలోనికి తీసుకోవాలని డిమాండ్‌చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు జెఎసి రాష్ట్ర కమిటి ఎప్ప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాలు మే 10 వ తేది లోగా సమస్యలు పరిష్కరించకపోతే మే 15 వ తేది తరువాత కుటుంబసభ్యులతో సహా నారా లోకేష్ గారి ఇల్లు ముట్టడిస్తాము.
ఈ కార్యక్రమంలో ఏపి స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ రాష్ట్ర చైర్మన్ ఏ.వి.నాగేశ్వరరావు, ఫ్యాక్టో చైర్మన్ సాయి శ్రీనివాస్, ఎపిటిఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సి.హెచ్.మంజుల, ప్రధాన కార్యదర్శి బసవలింగరావు, జెఎసి ప్రధాన కార్యదర్శి యు.కళ్యాణి, ఆర్గనైజింగ్ సెక్రటరీ జాన్మోడి, రాష్ట్ర జెఎసి నాయకులు రఫీ, వాసా శ్రీనివాసరావు, గంగాధర్, శ్రీరాంమూర్తి, జయరాజ్, వినోద్, దిలీప్, నాగార్జున, ప్రశాంతి, నాగేశ్వరరావు, పండు, ఎల్.బి.రమణ, ఈశ్వరరావు, ఓబిరెడ్డి, అంజి, రామన్న, వెంకటరమణ, అనీల్, వసుంధర, మునికష్ణ, చంద్రశేఖర్, విజయ్‌బాబు, రాధాకష్ణ, మహాలక్ష్మి, సంతోష్, గుంటూరు బాషా, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.










.jpeg)
No comments:
Post a Comment