Tuesday, 12 July 2016

*ఆన్లైన్ సభ్యత్వ కార్యక్రమం*


*అందరికి నమస్కారం,*


*ప్రతి సంవత్సరం మన సభ్యత్వాల కార్యక్రమం జరిగేది. కానీ కోవిడ్ నేపధ్యంలో 2020 సభ్యత్వాలు  ఇంకా ప్రారంభం కాలేదు.. అందువల్ల జెఏసి రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఈ సంవత్సరం ఆన్లైన్ ద్వారా సభ్యత్వాలు సేకరించి పూర్తి చేయాలని నిర్ణయించాము. ఈ నేపద్యంలో ఎక్కువ మంది సభ్యులుగా చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. కావున అన్ని విభాగాల నాయకులు, జెఏసి కార్యకర్తలు, ఉద్యోగులు పూర్తి స్థాయిలో పనిచేయాలి. ప్రతి ఒక్క ఉద్యోగి దగ్గర 100/- సభ్యత్వ రుసుము తీసుకోవాలి. గ్రూప్ గాని / వ్యక్తులు గాని రాష్ట్ర కమిటీ అకౌంట్ కి రుసుము పంపాలి..*


A/c No: 346402010025444,

IFSC code: UBIN0534641,

Union Bank, Governerpet,

 Vijayawada

సభ్యత్వం చెల్లించిన తరువాత ఈ క్రింది లింక్ లో payment recepit నెంబర్, మీ వివరాలు నమోదు చేయవలెను.. *

https://forms.gle/sWcT9iRYMEvuxcor6


సమగ్ర శిక్షా, కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్న సకల కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగులంతా సభ్యత్వాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము.


-ఎం.బాల కాశి,

రాష్ట్ర అధ్యక్షుడు

*ఎపి సమగ్ర శిక్షా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జెఏసి, రాష్ట్ర కమిటీ*




Click Here⇓⇓⇓⇓⇓⇓

RC No 1707/APSSA/A1/2017-2 dt 24.04.2014-#APSSA Re-Engagement of the service contract Employees.*Termination on 29.04.2018.. re-engage on 01.05.2018



అవార్డ్ గ్రహితలకు జేఏసీ రాష్ట్ర కమిటీ తరుపున అభినందనలు

Click Here⇓⇓⇓⇓⇓⇓













క్లిక్ చెయ్యండి..


*జె.ఎ.సి మరో అద్బుత విజయం..*
తొలిగించిన చిత్తూరు జిల్లా సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగులను తిరిగి విధులలోని చేరే ఆర్డర్స్ ను ఈ రోజు తీసుకున్నారు. రేపు విధులలోని చేరనున్న ఉద్యోగులు.నోటిఫికేషన్ భర్తీ లో గతంలో పనిచేస్తూ ఉద్యోగులకు అదనపు పాయింట్స్ ఇవ్వాలన్న జె.ఎ.సి డిమాండ్ తో అందరికి ఉద్యోగులు వచ్చాయి. జె.ఏ.సి చిత్తూరు జిల్లా ఉద్యోగుల సమస్యలు పై సంవత్సర కాలంగా దిర్గాకలిక పోరాటం నడిపి విజయం సాదించింది. ఈ పోరాటానికి సహకరించిన *ఎమ్మెల్సీ వై.శ్రీనివాసులురెడ్డి కి* జె.ఎ.సి రాష్ట్ర కమిటి మరియు చిత్తూరు జిల్లా ఉద్యోగుల తరుపున ధన్యవాదముల..ఎస్.ఎస్.ఎ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి ..*


*-ఎ.పి. సర్వ శిక్షా అభియాన్ కాంట్రాక్టు,అవుట్ సోర్సింగ్,కె.జి.బి.వి ఎంప్లాయిస్ ఫెడరేషన్ (జె.ఎ.సి), రాష్ట్ర కమిటి.*


డయల్ యువర్ లీడర్..
సర్వ శిక్షా అభియాన్ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, పార్ట్ టైం మరియు కె.జి.బి.వి ఉద్యోగుల సమస్యలు, వారి మనోభావాలను తెలుసుకొనే ప్రయత్నమే “డయల్ యువర్ లీడర్”. మొట్టమొదటి కార్యక్రమాన్ని విశాఖపట్నం జిల్లా నుండి ప్రారంభిస్తున్నాం.
ఈ కార్యక్రమం లో సర్వ శిక్షా అభియాన్ ఎంప్లాయిస్ జె.ఎ.సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.కాంతారావు(నాని) పాల్గొంటారు. ఫోన్ నెంబర్ 9490623349 ఆదివారం 23.07.2017 ఉదయం 10గం-12గం వరకు. విశాఖపట్నం జిల్లా లో ఉద్యోగుల సమస్యలు, ఉద్యోగుల మనోభావాలను పంచుకోవచ్చు,యునియన్ అభివృద్ధి కోసం సూచనలు, సలహాలు ఇవ్వచ్చు. అన్ని విభాగాల రాష్ట్ర మరియు జిల్లా నాయకులకు మరియు ఉద్యోగులు ఈ కార్యక్రమం పై విస్తృత ప్రచారం చెయ్యాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
డయల్ యువర్ లీడర్.. మనోభావాలను తెలుసుకొనే ప్రయత్నం.


మరో పోరాటానికి సిద్దంగా వుండాలి.
సర్వ  శిక్షా అభియాన్ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగులకు PAB ప్రకారం వేతనాలు పెంచాలి, PAB వర్తించని  విభాగాలకు G.O.MS.No. 95 మరియు G.O.MS.No. 151 ప్రకారం వేతనాలు పెంచాలి. అశాస్త్రీయ పద్దతులలో వేతనాలు పెంచితే.. ప్రతిఘటించాలి .. నాయకులు మరియు ఉద్యోగులు మరో పోరాటానికి సిద్దం కావాలి


క్లిక్ హియర్ 

07.07.2017 చలో విజయవాడ ప్రోగ్రాం ఫొటోస్














ఎస్.ఎస్.ఎ.ఉద్యోగుల ఘంటారావం ..
 జూలై 7  చలో విజయవాడ ను విజయవంతం చెయ్యండి.

సర్వ శిక్షా అభియాన్ కాంట్రాక్టు,అవుట్ సోర్సింగ్,పార్ట్  టైం, కె.జి.బి.వి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగుల ఉద్యోగ భద్రత, వేతనాలు పెంపు, వేతనం తో కూడిన ప్రసూతి సెలవులు, అక్రమ తొలిగింపులు, రే ఎంగేజేమేంట్ సమస్యలు పరిష్కారం కోసం ఎస్.ఎస్.ఎ.ఉద్యోగుల ఘంటారావం.. జూలై 7  చలో విజయవాడ ను విజయవంతం చెయ్యాలని అన్ని విభాగాల సంఘాల రాష్ట్ర మరియు జిల్లా నాయకులను, మరియు అన్నివిభాగాల ఉద్యోగులను కోరుతున్నాం. మన సమస్యలు పై ఐక్యంగా పోరాటం చేద్దాం.. కదలి రండి.. కలసి రండి..కదిలించండి.
-ఎ.పి.సర్వ శిక్షా అభియాన్ సర్వ శిక్షా అభియాన్ కాంట్రాక్టు,అవుట్ సోర్సింగ్,పార్ట్  టైం, కె.జి.బి.వి ఫెడరేషన్ (జె.ఎ.సి), రాష్ట్ర కమిటి.

Flash Proceedings:-
Rc.No.1707/SSA-AP/A9/2015 Dated:20 .06.2017.  of SPD. SSA, AP, Amaravati –Re-engagement of the services of outsourcing and contract employees under control of District Project Offices / KGBVs for the year   2017-18 – further instructions and guidelines – Issued.

-APSSAEF JAC

click here


Agreement Copy between Project Officer/ MEO/ HM, School Complexes and Employee




*KGBVs SOs  & CRTs Transfers Schedule Released.*
Rc No.2403/APSSA/KGBV/2017 dt 06.06.2017 of SPD,Hyd, Amaravathi. Replacement of SOs & CRTs- instructions issued-Reg.
*-APSSAEF JAC*




UNION ALERT:
సర్వ శిక్షా అభియాన్ కాంట్రాక్టు,అవుట్ సోర్సింగ్, పార్ట్ టైం, కె.జి.బి.వి ఎంప్లాయిస్ ఫెడరేషన్(జె.ఎ.సి) మండల,జిల్లా కమిటీ లకు మరియు ఉద్యోగులకు ముఖ్య విజ్ఞప్తి .. ప్రస్తుతం నవనిర్మాణ దీక్షలు నియోజకవర్గ కేంద్రం లో జరుగుతున్నాయి.  మంత్రులు, ఎమ్మెలు,ఎమ్మెల్సీ  మరియు ఇతర ప్రజాప్రతినిధులు లు మనకు అందుబాటులో ఉంటారు. కావున మన సమస్యలు పై వినతిప్రతం ఇవ్వండి ఇప్పటికే కొన్ని  నియోజకవర్గంలో జె.ఎ.సి నాయకులు వినతిపత్రంలు ఇచ్చారు. వారి అందరిని రాష్ట్ర కమిటి తరుపున అభినందనలు. అన్ని నియోజకవర్గంలో వినతి పత్రం ఇవ్వాలి. నాయకులు మరియు ఉద్యోగులు బాధ్యత తీసుకోవాలి..

⇓⇓⇓⇓⇓ click here

వినతిపత్రం.















పెర్ఫార్మన్స్  పేరు తో ఉద్యోగులను తొలిగించడం దుర్మార్గం..జె.ఎ.సి రాష్ట్ర కమిటీ.



పెర్ఫార్మన్స్ పేరుతో కె.జి.వి.బి స్పెషల్ ఆఫీసర్స్ మరియు సి.ఆర్.టి లను తొలిగించడం అన్యాయం. గత నాలుగు సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉత్తమ ఫలితాలను అందించే కె.జి.బి.వి ఉద్యోగులను తొలిగించడం దుర్మార్గం. గత వారం క్రితం పెర్ఫార్మన్స్ తో సంబంధం లేకుండా అందరిని రీ  ఎంగేజేమేంట్ చేస్తామని చెప్పిన రాష్ట్ర అధికారులు. నేడు దుర్మార్గంగా  ఉద్యోగులను తొలిగింపు ఉత్తర్వులు ఇచ్చారు.. ఈ చర్యను జె.ఎ.సి రాష్ట్ర కమిటి తీవ్రంగా ఖండిస్తుంది. ఈ ఉత్తర్వులను వెంటనే రద్దు చేసి, అందరిని విధులలోనికి తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది.. ఉద్యోగుల పక్షాన జె.ఎ.సి పోరాటం కొనసాగిస్తుంది. ఉద్యోగులు ఆందోళన చెందకుండా.. దైర్యంగా ఉండాలని జె.ఎ.సి కోరుతుంది. ఇలాంటి సమయంలో అందరం ఐక్య పోరాటానికి సిద్దంగా కావాలి. 

-ఎ.పి సర్వ శిక్షా అభియాన్ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, పార్ట్ టైం , కె.జి.బి.వి ఎంప్లాయిస్ ఫెడరేషన్(జె.ఎ.సి) రాష్ట్ర కమిటీ.



clink here⇓⇓⇓

Rc No 2190/APSSA/KGBV/2017 Dated 10.05.2017 SPD, APSSA Amaravathi- Performance of Special Officers below 50% - CRTs below 75% - Not to reengage/ Termination of their Services-Instructions-Issued-Reg.. SOs 19, CRTs 47 terminated.

CRP,DLMT,DT.E.O,IERTS, MIS Coord, Part time Instructor KGBV SO,CRT,PET,ANM, Accountant performance Indicators formats.


clink here⇓⇓⇓
ఎ.పి ఎస్.ఎస్.ఎ జె.ఎ.సి(APSSAEF JAC) కి లేఖ రాసిన కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి ప్రకాష్ జవదేకర్


సర్వ శిక్షా అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు పెంపు రాష్ట్ర ప్రభుత్వమే చెయ్యాలి- ఎ.పి ఎస్.ఎస్.ఎ జె.ఎ.సి(APSSAEF JAC) కి లేఖ రాసిన కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి ప్రకాష్ జవదేకర్

ఆంధ్ర ప్రదేశ్ సర్వ శిక్షా అభియాన్ కాంట్రాక్టు అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పై మాన్  జె.ఎ.సి నాయకత్వం మరియు సి.ఐ.టి.యు ఆల్ ఇండియా అధ్యకులు డా.కె.హేమలత, ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు(MP) తపన్ సేన్ ఫిబ్రవరి లో కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి ని మరియు కేంద్ర అధికారులను  డిల్లీలో కలిసిన విషయం అందరికి విదేతమే. ఆంధ్ర ప్రదేశ్ సర్వ శిక్షా అభియాన్ కాంట్రాక్టు అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్(జె.ఎ.సి) వినతి పత్రం పై స్పందించిన కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి ప్రకాష్ జవదేకర్.. మన సమస్యల పై సమాధానం ఇస్తూ ఒక లేఖను మన జె.ఎ.సి రాష్ట్ర కమిటి కి రాసారు. సర్వ శిక్షా అభియాన్ ప్రాజెక్ట్ కేంద్ర పధకం అయిన ఆ పధకం లో పనిచేస్తున్న కాంట్రాక్టు  టీచర్స్ మరియు ఉద్యోగుల సంబదించిన ఉద్యోగ నియామకాలు, జీతాలు, సర్వీస్ సంబదించిన విషయాలు రాష్ట్ర ప్రభుత్వ పరిదిలో ఉంటాయి అని, పై విషయాలు పై కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉండదని లిఖిత పూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వానికి, సర్వ శిక్షా అభియాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్(AP SSA SPD) కి తెలిపారు.
కొసమెరుపు:- ఆంధ్ర ప్రదేశ్ సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని కోరారు.
సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగుల జీతాలు పెంచాలని అడిగితే గత ప్రభుత్వావాలు నుండి ప్రస్తుత ప్రభుత్వాలు వరకూ  ఈ కేంద్ర ప్రభుత్వ పధకం అని తప్పించుకున్నారు.. ఇప్పుడు కేంద్ర మంత్రి స్వయానా పధకం కేంద్ర ప్రభుత్వం భాగస్వామీమే అయిన ఉద్యోగ నియామకాలు, జీతాలు, సర్వీస్ సంబదించిన విషయలు రాష్ట్ర ప్రభుత్వమే భాద్యత అని చెప్పిన తరువాత ఇప్పడే ఏమినంటుంది మన ప్రభుత్వం?
సర్వ శిక్షా అభియాన్ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ , పార్ట్ టైం కె.జి.బి.వి ఉద్యోగుల జీతాలు పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం పై ఐక్యం పోరాటానికి సిద్దం కావాలి అని  జె.ఎ.సి పిలుపునిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జీతాలు పెంచాలని జె.ఎ.సి రాష్ట్ర కమిటి డిమాండ్  చేస్తుంది.
- ఆంధ్ర ప్రదేశ్ సర్వ శిక్షా అభియాన్ కాంట్రాక్టు అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్(జె.ఎ.సి), రాష్ట్ర కమిటి.


*ముఖ్యమంత్రి చంద్రబాబు కు కాంట్రాక్టు ఉద్యోగుల సమస్య పై వినతి పత్రం ఇచ్చిన పి.డి.ఎఫ్ ఎమ్మెల్సీ వై.శ్రినువాసులు రెడ్డి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగుల జె.ఎ.సి సెక్రటరీ జనరల్ ఎం.బాల కాశి..*

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది కాంట్రాక్టు , అవుట్ సోర్సింగ్, అధ్యాపకుల, పార్ట్ టైం , కె.బి.వి.బి, గెస్ట్,యూనివర్సిటీ, కేంద్ర,రాష్ట పధకాలు లో విద్య, వైద్య పనిచేస్తున్న ఉద్యోగులు, ఎ వి.ఆర్.ఓ లు మరియు ఇతర ఉద్యోగులు  దీర్గకాళిక  సమస్యలు పై గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు కి పి.డి.ఎఫ్ ఎమ్మెల్సీ వై.శ్రినువాసులు రెడ్డి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగుల జె.ఎ.సి సెక్రటరీ జనరల్ ఎం.బాల కాశి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఉద్యోగ భద్రత, వేతనాలు పెంపు, వేతనం తో కూడిన ప్రసూతి సెలవులు, క్రమబద్దీకరణ, సకాలంలో జీతాలు చెల్లింపులు.. అనేక కీలకమైన అంశాలను ముఖ్యమంత్రి గారికి  వివరించడం జరిగింది. కొన్ని సర్వ శిక్షా అభియాన్, నేషనల్ హెల్త్ మిషన్, మెడికల్ హెల్త్ విభాగాలల్లో  లో 151 ప్రకారం వేతనాలు అమలు చెయ్యడం లేదు అని, దీని వల్ల 70 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు అన్యాయం జరిగింది అని  ముఖ్యమంత్రి గారి  ద్రుష్టి కి తీసుకొని వెళ్లారు. దీర్ఘకాలంగా పరిష్కారం కానీ ఎ.వి,ఆర్.ఎ ను సమస్య పరిష్కారం చెయ్యాలని, చాలిచాలని జీతాలు తో కాంట్రాక్టు ఉద్యోగులు బాధలు పడుతున్నారు అని, వారి సమస్యలు పరిష్కారం కోసం ఆలోచించాలని విజ్ఞప్తి చేసారు.

*-JAC OF STATE GOVERNMENT CONTRACT AND OUT SOURCING EMPLOYEES, TEACHERS & WORKERS, STATE COMMITEE.*


గౌరవ విద్యాశాఖా మంత్రి గంట శ్రీనివాసరావు  కలిసిన ఎస్.ఎస్.ఎ. జె.ఎ.సి రాష్ట్ర నాయకులు..
17884257_1095010347312373_2298132752686329549_n.jpg17759780_1095010420645699_8150311498224733146_n.jpgవిద్యాశాఖా మంత్రి శ్రీ  గంట శ్రీనివాసరావు ను  సర్వ శిక్షా అభియాన్ కాంట్రాక్టు అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (జె.ఎ.సి) రాష్ట్ర గౌరవ అధ్యకుడు ఎ.వి.నాగేశ్వరరావు, రాష్ట్ర అధ్యకుడు ఎం.బాల కాశి, సి.ఆర్.పి యునియన్  రాష్ట్ర అధ్యకుడు ఎం. కాశి, పార్ట్ టైం టీచర్స్ యునియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవేంద్ర రావు, కృష్ణ జిల్లా జె.ఎ.సి నాయాకులు వెంకట్ కలిసారు. పి.డి.ఎఫ్ ఎమ్మెల్సీ లు బొడ్డు నాగేశ్వరరావు, వై.శ్రీనివాసులు రెడ్డి, రాము సూర్యారావు  ఆధ్వర్యంలో  విద్యాశాఖా మంత్రి గంట శ్రీనివాసరావు ను , విద్యాశాఖా ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ ను, సర్వ శిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.శ్రీనివాసులు ను కలిసారు.. వేతనాలు పెంపు, ఉద్యోగ భద్రత, వేతనం తో కూడిన ప్రసూతి సెలవులు.. అనేక విషయాలు ఫై వినతిపత్రం ఇవ్వడం జరిగింది







ప్రతిపక్ష నేత జగన్ ను కలిసిన  ఎస్.ఎస్.ఎ. జె.ఎ.సి.రాష్ట్ర అధ్యక్షుడు ఎం.బాల కాశి..
సర్వ శిక్షా అభియాన్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, పార్ట్ టైం, కె.బి.వి.బి ఉద్యొగుల సమస్యలను ప్రతిపక్ష నేత జగన్ కు , జె.ఎ.సి రాష్ట్ర అధ్యకుడు ఎం.బాల కాశి వివరించారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు పెంచి,  సర్వ శిక్షా అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు పెంచక పోవడాన్ని జగన్ దృష్టి కి తీసుకొని వెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా  విద్యారంగానికి సేవ చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వ్యవహరి శైలిని జగన్ కు తెలియచేసారు. అసెంబ్లీ సమావేశం లో సర్వ శిక్షా అభియాన్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, పార్ట్ టైం, కె.బి.వి.బి ఉద్యొగుల సమస్యల పై చర్చించాలని కోరారు. ఉద్యోగ భద్రత , వేతనాలు పెంపు, వేతనం తో కూడిన ప్రసూతి సెలవులు అనేక సమస్యలను జగన్ కు తెలియచేస్తూ వినతి పత్రం ఇచ్చారు.
ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడుతూ  సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాను అని, అసెంబ్లీ సమావేశం లో ప్రభుత్వాన్ని నిలదీస్తాను అని చెప్పారు.. అవసరం అయితే ప్రత్యేక్ష పోరాటానికి వస్తాను అని చెప్పారు.
ఈ రోజు మరోమారు కృష్ణ జిల్లా జె.ఎ.సి నాయకులు తో కలసి ప్రతిపక్ష నేత జగన్ ను కలవనున్నారు  జె.ఎ.సి.రాష్ట్ర అధ్యక్షుడు ఎం.బాల కాశి .
-ఎ.పి.సర్వ శిక్షా అభియాన్ కాంట్రాక్టు అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్(జె.ఎ.సి), రాష్ట్ర కమిటి.


Today(16.03.2017) AP SSA contract and out sourcing employees federation(JAC) state committee meet ASPD Mastanaiah ,chief finance controller gurumurthy, and gave representation for our salaries enhancement and other issues. also meet all wings state level officers . They are respond positively on our representation.  M.Balakasi JAC state president, M.Kasi CRP State leader, Rajendraprasad part time teachers state president, Devendrarao JAC state Leader , mastan(Guntur),Srinivas(east godhavari), Nagajyothi(Guntur), Sirjunnisa, Bairava murthy(east godhavari), ijrayal Prasad,Saritha Rani(Krishna) ,Hemaraju(CRP Krishna dist leader) and employees are present. 



*UNION ANNOUNCEMENT*
యునియన్ సమాచారం నేరుగా ఈమెయిలు కి పంపడం జరుగుతుంది. *ముఖ్యమైన ప్రభుత్వ ఆర్డర్స్,ప్రోసిడింగ్స్, విలువైన సమాచారం నేరుగా ఈ మెయిల్ కు మెయిల్ చేయబడును.ఈ క్రింది  పేరు, ఈమెయిలు వివరాలను నమోదు చేసుకోవాలి మనవి.
















కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి- పిడిఎఫ్‌ ఎమ్మెల్సీల డిమాండ్‌- ఎస్‌ఎస్‌ఎ కార్యాలయం వద్ద ధర్నా- ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎస్‌పిడి హామీ,ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :సర్వశిక్ష అభియాన్‌(ఎస్‌ఎస్‌ఎ)లో కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయాలని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడి పోరా టం చేయాలని పిలుపునిచ్చారు. విజయవాడలోని ఎస్‌ఎస్‌ఎ రాష్ట్ర కార్యాలయం వద్ద కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు మంగళవారం ధర్నా నిర్వహించారు. సర్వశిక్షా అభియాన్‌ కాంట్రాక్ట్‌ అండ్‌ ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు గేయానంద్‌, వై శ్రీనివాసులురెడ్డి, బొడ్డు నాగేశ్వరరావు, ఉత్తరాంధ్ర పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి అజ శర్మ పాల్గొని ప్రసం గించారు. ఈ సందర్భంగా గేయానంద్‌ మాట్లాడుతూ కాంట్రాక్ట్‌ ఉద్యోగులపై వేధింపులు అధికమయ్యాయని, ఎస్‌ఎస్‌ఎ రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన ఉత్తర్వులను పట్టించుకోకుండా ఇష్టానుసారం వ్యవహరి స్తున్నారని ధ్వజ మెత్తారు. శ్రీనివాసులు రెడ్డి మాట్లా డుతూ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు వెట్టిచాకిరీకి గురవుతు న్నారని, నిధుల కొరత పేరుతో అధికారులు సరిగా జీతాలు చెల్లించడం లేదన్నారు. జిఓ 151ని అమలు చేయాలని, సమస్యలు పరిష్కరించ కుంటే పోరుబాట నిర్వహిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరో ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మంత్రులను, అధికారులను కలిసినా ప్రయోజనం లేదన్నారు. కనీస వేతనం, భద్రత ఉండాలని ప్రభుత్వాలే చట్టాలు, జీఓ లను తీసుకొస్తున్నాయని, వీటిని అమలు చేయక పోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటని అజ శర్మ విమర్శిం చారు. యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి పి బాబురెడ్డి మాట్లా డుతూ రెగ్యులర్‌ చేసేందుకు అర్హత ఉన్నా కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యో గులుగా ఎందుకు కొనసాగిస్తున్నా రని ప్రశ్నించారు. ఫెడరే షన్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎం బాలకాశి, బి కాంతారావు మాట్లాడుతూ 151 జిఓను ఎస్‌ఎస్‌ఎ కాంట్ట్రాక్‌ ఉద్యోగులకు వర్తింపజేయ కుండా నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తుందని విమర్శించారు. కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వ రరావు మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగు లకు వేతనాలు పెంచాలని, రాష్ట్రవ్యాప్తంగా ఒకే రెన్యు వల్‌ విధానం తీసుకురావాలని కోరారు. ఈ నెల 21న ఉద్యోగుల సమస్యలపై 13 జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఫెడరేషన్‌ తెలిపింది.

సమస్యల పరిష్కారానికి కృషి : ఎస్‌పిడి

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎస్‌ఎస్‌ఎ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాస్‌ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ధర్నా కార్యక్రమం వద్దకు వచ్చిన ఆయనకు పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు ఉద్యోగుల సమసస్యలను పరిష్కరిం చాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ తన పరిధిలో ఉన్న అంశాలను పరిష్కారి స్తా నని, ఆర్థిక శాఖతో ముడిపడి ఉన్న అంశాలను ప్రభుత్వం దృ ష్టికి తీసుకెళ్తానని తెలిపారు. రెగ్యులర్‌ అంశం తన పరిధిలో లేదని, ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.


Rc No 911/APSSA/KGBV/2016 APSSA, Vijayawada - KGBV- Recruitment of Computer Instructors in KGBVs on full time basis for the A.Y. 2016-17- Approval of Outsourcing Agency Sri Vengamanmba Security & House Keeping Services,Tirupathi.


Rc No 2361/APSSA/KGBV/2016 dt 29.08.2016 of the SPD- Proposal for relocation(Transters) of SOs,CRTs, and PETs, of KGBV in AP 

 

కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ దోపిడీ, బానిసత్వ విధానాలకు వ్యతిరేకంగా, మన ఐక్యత, మన హక్కుల పరిరక్షణకు 2016 సెప్టెంబర్ 2 సమ్మె లో పాల్గొనండి..

.పి.స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (జె.ఎ.సి) పిలుపు మేరకు సర్వ శిక్షా అభియాన్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 10 వ పి.ఆర్.సి ప్రకారం వేతనాలు ఇవ్వాలని, క్రమబద్దీకరణ చెయ్యాలని, ఉద్యోగ బద్రత కల్పించాలని, వేతనం తో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జరిగే ..సెప్టెంబర్ 2 సమ్మె లో ఉద్యోగులందరూ పాల్గొని విజయవంతం చెయ్యవలసిందిగా కోరుతున్నాం.
- ఎ.పి.సర్వ శిక్షా అభియాన్ కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (జె.ఎ.సి), రాష్ట్ర కమిటి.



మరో పోరాటానికి సిద్దం కావాలి..

ఎపి స్టేట్ కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఉమ్మడి పోరాటం ఫలితంగా జీతాలు పెంచుతూ గవర్నమెంట్ ఆర్డర్స్ విడుదల చెయ్యడం జరిగింది. కానీ ఈ ఆర్డర్స్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పధకాలలో, లోకల్ బాడీస్, స్టేట్ పబ్లిక్ సెక్టార్ , విశ్వవిద్యాలయాలలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల గురించి క్లారిఫికేషన్ ఇవ్వలేదు.. గత 2011 లో కూడా జి.ఒ నెంబర్ 3 కేంద్ర, రాష్ట్ర పభుత్వ పధకాలలో పనిచేసిన వారికీ వర్తింపు చెయ్యలేదు.. మరలా కేంద్ర రాష్ట్ర పభుత్వం పధకాలలో పనిచేస్తున్న వారు ఉమ్మడి పోరాటం ఫలితంగా 2013లో ఆ జి.ఒ వర్తింపు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. సర్వ శిక్షా అభియాన్ కేంద్ర పధకం కావచ్చు కానీ మన యజమాని మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే కాబట్టి పెరిగిన జీతాలు మనకు కూడా వర్తింపచెయ్యాలి మనం మరో పోరాటానికి సిద్దం కావాలి.. ఆ దిశగా అన్ని విభాగాలు ఫెడరేషన్ (జె.ఎ.సి)కి సహకరించాలి.. త్వరలో సి.యం. గారిని , రాష్ట్ర మంత్రులను, రాష్ట్ర అధికారులను కలసి వినతి పత్రం ఇద్దాం.. మన న్యాయమైన హక్కులను సాధించుకుందాం..



ఈ రోజు (08.08.2016)  ఎ.పి. సర్వ శిక్షా  అభియాన్ కాంట్రాక్టు అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్(జె.ఎ.సి) ఆధ్యర్యంలో అన్ని విభాగాల తో కలసి రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ ని కలవడం జరిగింది. చిత్తూరు జిల్లాలో తొలిగించిన ఉద్యోగులకు తిరిగి విధులలోని తీసుకోవాలి, జీతల పెంపు, ఉద్యోగ భద్రత, రీ రెంగేజ్మేంట్ సమస్యలను పరిష్కరించాలి అని ఎస్.పి.డి కోరడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు..  ఈ కార్యక్రమంలో జె.ఎ.సి రాష్ట్ర అధ్యక్షుడు ఎం.బాల కాశి, ప్రధాన కార్యదర్శి బి.కాంతారావు, అన్ని విభాగాల నాయకులు స్టాలిన్,శ్రీనివాస్, రంజీ,దివాకర్,పోతయ్య, సుదర్శన్,సాయి,కళ్యాణి,  తరితరులు  మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.







చిత్తూరు జిల్లలో తొలిగించిన 122 మంది సర్వ శిక్షా అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగులకు రీ ఎంగేజ్మెంట్ చెయ్యాలని కోరుతూ ఇన్-చార్జ్ విద్యా శాఖా ప్రధాన కార్యదర్శి సిసోడియా కి వినతి పత్రం ఇస్తున్నా ఎం.ఎల్.సి వై.శ్రీనివాస రెడ్డి, యు.టి.ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.బాబు రెడ్డి, జె.ఎ.సి నాయకుల మరియు ఉద్యోగుల









అశాస్త్రితమైన వేతనాలు పెంపును సవరించాలని కోరుతూ వినతి పత్రం

11 comments:

  1. Nice thought from mohan reporter

    ReplyDelete
  2. Nice thought from mohan reporter

    ReplyDelete
  3. Super sir. Manam andaram okkate kavali govt madalu vanchali

    ReplyDelete
  4. కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల సాధనకు ప్రతి ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి నడుంభిగించాలి....పోరాటాలతోనే మన హక్కులు సాధించుకోగలం..నిరంతరం కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై కృషి చేస్తున్న రాష్ట్ర, మరియు మా కర్నూలు జిల్లా నాయకులకు విప్లవాది వందనాలు...N.కీర..Art Teacher..Kurnool Dist.Adoni.

    ReplyDelete
  5. కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల సాధనకు ప్రతి ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి నడుంభిగించాలి....పోరాటాలతోనే మన హక్కులు సాధించుకోగలం..నిరంతరం కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై కృషి చేస్తున్న రాష్ట్ర, మరియు మా కర్నూలు జిల్లా నాయకులకు విప్లవాది వందనాలు...N.కీర..Art Teacher..Kurnool Dist.Adoni.

    ReplyDelete
  6. SSA కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల సాధనకు సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో దూసుకుపోతున్న SSA కాంట్రాక్టు & అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు..

    ReplyDelete
  7. SSA కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల సాధనకు సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో దూసుకుపోతున్న SSA కాంట్రాక్టు & అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు..

    ReplyDelete
  8. namaste sir
    i am guntur dt merc
    messengers gutur dt
    sir maku 6 moths nundi salarys levu miku yamayina telusaameku yemayinaa information telisiunte chepandi plzzzzzzz sir

    ReplyDelete
  9. Respected to all state SSA leaders,
    I am physiotherapist working in SSA since 2010 ,almost 6 years over still we are doing in SSA as a physios under honorarium basis,other employees like IERT,CRP,KGBV,DEO,MESSENGER,etc...
    The issue is
    1.why don't invite us(physiotherapists) as a part or contract employee of ssa?
    2.Why don't allow physios to merge with in your ssa jac ?
    3.pls treat us as a part of ssa employee,because we are also working in several years.we are waiting and ready to join with sate ssa jac like other ssa employees.
    4.i would like to bring onething to your kind notice that everybody told that physios are belongs to medical profession,ssa is education department so how you are working in this project for life long?but my answer is may be we are in medical but as per project guidelines we are appointed to give treatment and make them as as independent to do their daily activities,our work also like continue work.not time period work.
    5.totally some physios purely depending on only ssa.so we also having some expectations like job security,salary hike etc...
    6.hence dear superior leaders kindly allow us,treat us,physios also one of the contract employee in ssa,
    pls do favor for us.
    Thanking you,
    Karun
    9059672032

    ReplyDelete
  10. Hello sir / madam
    I am shaik irfan basha graduated in civil engineering in 2018 with 61%. Please inform me you have vacancy in site engineer post.
    My cell no :8978284320 ( whatsapp) my email: irfan111shaik@gmail.com
    Wait for the good response
    Thank you

    ReplyDelete