కార్మిక చట్టాల సవరణ ఎవరి ప్రయోజనాల కోసం?*కేంద్రంలో మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్స్‌కు వత్తాసు పలుకుతూ రాష్ట్రంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కార్మిక చట్టాలకు సవరణలు చేసింది. కార్మికుల హక్కులకు నష్టం కలిగించడంలో వీరిద్దరిదీ ఒకే వైఖరి అని మరో సారి తేటతెల్లమైంది. అనేక సంవత్సరాలు కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలకు తూట్లు పొడుస్తూ పాలకులు ఈ విధానాలు తెచ్చారు. యజమానులు తమ వ్యాపారాలను తేలిగ్గా చేసుకునేందుకు ఈ మార్పులు తెస్తున్నామని కేంద్ర, రాష్ట్ర పాలకులు నిస్సిగ్గుగా చెబుతున్నాయి. దీనిపై ఇక తేల్చుకోవాల్సింది కార్మిక వర్గమే. పోరాడి సాధించుకున్న చట్టాలను తిరిగి ఐక్య పోరాటాల ద్వారానే నిలబెట్టుకోవాలి. కేంద్ర, రాష్ట్ర పాలకుల కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలి.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పని గంటలు, విశ్రాంతి, రాత్రి పూట పని చేయించడం తదితర అంశాల్లో చట్టాలకు తూట్లు పొడుస్తూ మార్పులు చేసింది. ”ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” అమలు కోసం, యజమానులు తమ వ్యాపారాలను తేలిగ్గా చేసుకునేందుకు ఈ మార్పులు తెస్తున్నామని ప్రెస్ మీట్‌లో గౌరవ మంత్రివర్యులు ప్రకటించారు. ఈ సవరణలను పరిశ్రమలు, సంస్థలపై ప్రస్తుతం ఉన్న చట్టాల అమలు వల్ల కలిగే విధానపరమైన భారాన్ని తగ్గించడానికేనని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా తమ పెట్టుబడిదారీ వర్గ అనుకూల ధోరణిని బయటపెట్టారు. ఈ మార్పుల వలన రాష్ట్రంలోని ఫ్యాక్టరీలు, షాపులు, సంస్థల్లో పని చేసే 50 లక్షల మంది కార్మికులు నష్టపోతారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గత 13 సంవత్సరాలుగా షెడ్యూల్డ్ ఎంప్లారుమెంట్స్‌లో కనీస వేతనాల సవరణ చేయకపోవడం వలన వీరంతా ఆర్థిక దోపిడీకి గురవుతున్నారు. ఈ సవరణల ద్వారా మరింత దోపిడీకి గురవుతారు. ఆ మేరకు యాజమాన్యాలు లాభపడతాయి. స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయడం లేదు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేయడం లేదు. వీరెవరికీ సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. దాదాపు 50 లక్షల మందిగా ఉన్న భవన నిర్మాణం, హమాలీ, ఆటో, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టు, షాప్ ఎంప్లాయీస్ తదితర అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత సౌకర్యాలు అమలు కావడం లేదు. వీటిని పట్టించుకోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నేడు యాజమాన్యాల సౌలభ్యం కోసం ఈ మార్పులు తేవడం సరైనది కాదు. ఎన్నికల ముందు కార్మిక సంక్షేమం, సామాన్య ప్రజానీకం గురించి మాట్లాడి ఓట్లు వేయించుకున్న తెలుగుదేశ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఈ మార్పులు తెచ్చింది. వీటికి వ్యతిరేకంగా జులై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో సంఘాలకు అతీతంగా కార్మికవర్గం పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసనను తెలపాలి.ఫ్యాక్టరీల చట్టం సెక్షన్ 54ను సవరించి ప్రస్తుతం విరామంతో సహా ఉన్న 9 గంటల పనిని 10 గంటలకు పెంచాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టంలో షాపులకు సంబంధించి సెక్షన్ 9, సంస్థలకు సంబంధించి సెక్షన్ 16ను సవరించి అవసరాన్ని, సీజన్‌ను బట్టి రోజుకు 8 గంటల పనిని 10 గంటల వరకూ పెంచవచ్చన్నారు.వారంలో పని గంటలు 48 గానే యథాతథంగా ఉంటాయని (రోజుకు 8 గంటలు ఞ 6 రోజులు), చెబుతున్నా ఆచరణలో కార్మికుడిపై పని గంటలు, పని భారం పెరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న రోజుకు 8 గంటల పనిని మార్చే హక్కు ప్రభుత్వానికి లేదు. 8 గంటల పనిని డబుల్ వేతనంతో ఓటి చేయించుకోవాలన్నా కూడా కార్మికుడి రాతపూర్వక ఒప్పందం ఉండాలి. ఇదేదీ లేకుండా రోజువారీ పని గంటల్లో ఏకపక్షంగా పై మార్పులు చేయడం యాజమాన్యాల ప్రయోజనం కోసమే.ఫ్యాక్టరీల చట్టం సెక్షన్ 55, ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టంలో షాపులకు సెక్షన్ 10, సంస్థలకు సెక్షన్ 17లను సవరించి 5 గంటల పని అనంతరం విరామం పొందేందుకు ప్రస్తుతం ఉన్న అవకాశాన్ని 6 గంటల పాటు పని చేసిన తర్వాత మాత్రమే విరామం ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఇది కార్మికుడి ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుంది. ఆరోగ్య సూత్రాల ప్రకారం ప్రతి 3 గంటలకోసారి అల్పాహారమో / పూర్తి ఆహారమో / తేనీయాలో తీసుకోవాలి. దాన్ని కూడా ఈ సవరణల ద్వారా నిరాకరించడం అమానుషం.ఫ్యాక్టరీల చట్టం సెక్షన్ 56లో భోజన విరామం, ముందుగా తెలియని / నిరోధించలేని ఏదైనా అత్యవసర పరిస్థితులలో కార్మికుని 8 గంటల పనిని 10.30 గంటల్లో విస్తరించవచ్చన్న నియమాన్ని సవరించి ఇప్పుడు 12 గంటలుగా మార్చారు. అంటే అంతకు ముందు అవాంతరాలతో కలిపి 2.30 గంటలుగా ఉన్న విరామం ఇప్పుడు 4 గంటలుగా మారుతుంది. అలాగే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టంలో షాపులకు సంబంధించి సెక్షన్ 11, సంస్థలకు సంబంధించి సెక్షన్ 18లో ఉన్న అన్ని విరామాలతో కలిపి 8 గంటల పనిని 12 గంటల్లో విస్తరించవచ్చన్న నియమం కొనసాగుతుంది. పని గంటలు పెరిగినా విరామాలతో కలపి 12 గంటలు మించవన్న లేబర్ కమిషనర్ వివరణ అంగీకరించరానిది. ఒకవైపు విరామాన్ని గంట పెంచడం మరియు 8 గంటల పని విస్తరణను మరో 2 గంటలు పెంచడం వలన కార్మికులు నష్టపోతారు. తమ కుటుంబాలతో గడపడానికో / ఇంటి వద్ద విశ్రాంతి తీసుకోవాడానికో వినియోగించాల్సిన కాలాన్ని ఫ్యాక్టరీలో వెచ్చించాల్సి వస్తుంది. ఆ మేర కార్మికులకు మానసికంగా ఇబ్బంది కలుగుతుంది.గతంలో ప్రతి మూడు నెలలకు 50 నుండి 75 గంటలు అదనంగా కార్మికుని రాతపూర్వక అనుమతితో ఓటి చేయించుకోవచ్చు. ఇప్పుడు ఆ ఓటి కాలాన్ని 144 గంటలకు పెంచారు. దీని వలన కార్మికునిపై పని భారం, పని ఒత్తిడి పెరుగుతాయి. కొత్త వారికి ఉపాధి తగ్గుతుంది. ఈ మేరకు యాజమాన్యాలు లాభపడ్డానికే ఈ ప్రతిపాదన తెచ్చారు.ఫ్యాక్టరీల చట్టంలోని సెక్షన్ 66 ప్రకారం మహిళా కార్మికులతో రాత్రి 7 గంటల తర్వాత, ఉదయం 6 గంటల్లోపు పని గంటల్లో నియమించకూడదు. అయితే ఈ సెక్షన్ ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉందని గతంలో చాలా రాష్ట్రాల్లో హైకోర్టులు కొట్టేశాయి. మహిళలకు కూడా పని ప్రాథమిక హక్కుగా కల్పించాలనే ఉద్దేశంతో కోర్టులు మహిళలకు తగిన భద్రత, రవాణా, ఇతర సౌకర్యాలు కల్పించి వారి అంగీకారంతో రాత్రి షిఫ్టుల్లో పని చేయించుకోవాలని తీర్పులిచ్చాయి. మహిళా సంఘాలు కూడా ఈ పని హక్కుకు మద్దతునిచ్చాయి. 2015, 2022లో డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు తీర్పుకు అనుగుణంగా యజమాని తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ పేర్కొంటూ సర్క్యులర్‌ను (25.10.2022న) జారీ చేశారు. ఆ నిబంధనల ప్రకారం మహిళా కార్మికులు రాతపూర్వకంగా అంగీకారం తెలపాలి. ప్రసూతి సెలవు నిబంధనలకు లోబడి మాత్రమే పని చేయించాలి. పనికి వచ్చేటప్పుడు, తిరిగి వెళ్లేటప్పుడు ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం కల్పించాలి. పని ప్రదేశాల్లో టాయిలెట్లు, మంచినీరు, రక్షణ, తదితర సౌకర్యాలన్నీ కల్పించాలి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. లైంగిక వేధింపుల చట్టం అమలు చేయాలి. కానీ చాలా ప్రదేశాల్లో ఇవేవీ అమలు కాని పరిస్థితి ఉన్నది. ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షణే లేదు. పెట్టుబడిదారులకు అనుకూలంగా నయా ఉదారవాద విధానాలు అవలంభిస్తున్న కేంద్ర, రాష్ట్ర పాలకులు వీటి పర్యవేక్షణకు తగిన యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయని దుస్థితి నేడు నెలకొంది. ఫ్యాక్టరీల్లో వరుస ప్రమాదాలు జరిగి కార్మికులు, ప్రజలు చనిపోతున్నా పట్టించుకోని పరిస్థితి మన కళ్ల ముందుంది. ఈ నేపథ్యంలో మహిళలకు పూర్తి రక్షణ కల్పించి రాత్రిపూట పని చేయించుకోవాలని ప్రభుత్వం ప్రకటించినా ఆ చరణలో దానికి తగ్గ ఏర్పాట్లు నేడు రాష్ట్రంలో లేవు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర క్యాబినెట్ ఈ సవరణ చేయడం దుర్మార్గం. పై నిబంధనలన్నింటి అమలు గ్యారంటీ చేశాకే, దానికి తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకుండా ఈ నిర్ణయం సరైనది కాదు.పై సవరణలతో పాటు ఇప్పటికే రాష్ట్రంలో లేబర్ కోడ్స్‌కు అనుగుణంగా పారిశ్రామిక వివాదాల పరిష్కారం కోసం కార్మికులు దరఖాస్తు చేసుకోవాల్సిన కాలాన్ని మూడు సంవత్సరాల నుండి రెండు సంవత్సరాలకు తగ్గించారు. మూడు సంవత్సరాల కాలం అయితే వివాదాలు పెరుగుతున్నాయని, ఇవి తగ్గడానికంటూ రెండు సంవత్సరాలకు కుదించింది. కార్మికులు సమ్మె చేయాలంటే అత్యవసర సర్వీసుల్లో 14 రోజుల ముందు నోటీసునివ్వాలి. దీన్ని అత్యవసరం కాని సేవల్లో కూడా ఈ 14 రోజుల నోటీసునివ్వాలని సవరణలు తెచ్చారు. జరిమానాలకు సంబంధించి యాజమాన్యాలు చిన్నపాటి జరిమానాలతో తప్పించుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ చట్టం సవరించారు. చట్టాల ఉల్లంఘనపై యాజమాన్యాలపై కోర్టులకు వెళ్లకుండా, వారు ఇబ్బందులు పడకుండా అప్పటికప్పుడు చిన్నపాటి జరిమానాలు కట్టి తప్పించుకునేలా వెసులుబాటు కల్పించారు.కనీసం కార్మిక సంఘాలతో కూడా చర్చించకుండా ఈ ప్రతిపాదనలు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించడం దుర్మార్గం. పూర్తిగా కార్మిక వ్యతిరేకమైన ఈ ప్రతిపాదనలు వెంటనే ఉపసంహరించుకునేలా కార్మికవర్గం ఐక్యంగా పోరాడాలి. వామపక్షాలు అధికారంలో ఉన్న కేరళ మినహా కేంద్రంలో, మనతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక సవరణలు చేయడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారింది. కర్ణాటకలో అంతకు ముందున్న బిజెపి ప్రభుత్వం వారపు పనిగంటలు 48 గానే ఉంచి, రోజువారీ పని గంటలను అవసరాన్ని బట్టి పెంచుకోవడమో లేదా తగ్గించుకోవడమో చేయవచ్చని చట్టాన్ని మార్చింది. ప్రస్తుత ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తోంది. ఆ బాటలోనే నేడు తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పయనిస్తోంది. కేంద్రంలో బిజెపి కార్మిక చట్టాల సవరణలతో తెచ్చిన లేబర్ కోడ్స్‌కు పార్లమెంట్‌లో తెలుగుదేశం, వైసిపి లు అమోదం తెలిపాయి. పార్లమెంట్‌లో వామపక్షాలు వ్యతిరేకించాయి. కార్మిక హక్కులను హరించడంలో మిగిలిన పార్టీల విధానం ఒక్కటే. దీన్ని కార్మికవర్గం గమనించాలి. వీటికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలి. ఈ సవరణలను తిప్పి కొట్టాలి. జులై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను రాష్ట్రంలో జయప్రదం చేయాలి. జులై 9న పెద్ద ఎత్తున అన్ని మండలాలు, పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో వేలాదిగా నిరసనలు తెలపాలి.-వ్యాసకర్త : ఎ.వి. నాగేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు
Sunday, 15 June 2025
Thursday, 14 November 2024
మంత్రి నారా లోకేష్ గారిని కలిసిన జెఎసి నాయకులు
పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు (ఐవి) ఆధ్వర్యంలో గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని కలిసిన జెఎసి రాష్ట్ర నాయకత్వం.. సమ్మె కాలపు జీతం విడుదల పై మంత్రిగారికి ధన్యవాదాలు తెలిపారు. హెచ్.ఆర్ పాలసీ వర్తింప చేయాలని, మినిమం ఆఫ్ టైం స్కేల్ అమలుచేయాలని, ఇతర విషయాలు పైన వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జెఎసి గౌరవ అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు, రాష్ట్ర చైర్మన్ కాంతారావు నాని, జనరల్ సెక్రటరీ కల్యాణి, ఆర్గనైజేషన్ సెక్రటరీ జాన్ మోడీ, కో-చైర్మన్లు డా.బోమ్మిడి నాగరాజు, మహమ్మద్ రఫీ, వైస్ చైర్మన్ వాసా శ్రీనివాస్, ఏలూరు జిల్లా నాయకులు బాలాజీ, బాపట్ల జిల్లా నాయకులు వీరాంజనేయులు పాల్గొన్నారు.
Tuesday, 15 October 2024
Sunday, 21 July 2024
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పార్టమ్, గెస్ట్, కంటింజెంట్, తదితర క్యాడర్ల ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం, ఈ లోగా యం.టి.ఎస్ అమలు, డైరెక్ట్ పేమెంట్ అమలు, రెగ్యులరైజేషన్, అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయమని రాష్ట్రప్రభుత్వాన్ని కోరుతూ ఏపి స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్, టీచర్స్, వర్కర్స్ జేఏసీ కోరుతున్నది. క్రింది సమస్యలను పరిష్కరించమని కోరుతూ ఏకగ్రీవంగా నేటి రాష్ట్ర సమావేశం తీర్మానించింది
Friday, 5 July 2024
*గౌరవ విద్యా శాఖ మంత్రి గౌరవ నారా లోకేశ్ గారిని, గౌరవ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ IAS గారిని, ఎస్పిడీ గారికి కలిసిన జేఏసీ గౌరవ అధ్యక్షులు ఏ.వి.నాగేశ్వరరావు గారు. సమ్మె కాలపు జీతం, సమ్మె అగ్రిమెంట్స్ హెచ్ఆర్ పాలసీ కమిటీల MTS అమలు, పెండింగ్ వేతనాలు పైన గౌరవ మంత్రి శ్రీ నారా లోకేశ్ గారికి, ప్రిన్సిపాల్ సెక్రటరీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. పెండింగ్ వేతనాలు ఈ వారంలో వేస్తామని ఇతర సమస్యలు మరికొద్ది రోజులల్లో పరిష్కరిస్తామని గౌరవ మంత్రి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు హామీ ఇచ్చారు**-kantharao Nani**రాష్ట్ర చైర్మన్*
date 05.07.2024 జేఏసీ సెక్రటరీ జనరల్ యు.కళ్యాణి , వైస్ చైర్మన్ వాసా శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ రవీంద్ర బాబు నాయకత్వంలో జెఎసి ప్రతినిధి బృందం ఈరోజు గౌరవ విద్యా శాఖ మంత్రి శ్రీ నారా లోకేశ్ గారిని కలిసి పెండింగ్ వేతనాలు, సమ్మె కాలం జీతం, ఇతర సమస్యల పైన వినతి పత్రం ఇచ్చారు.**👉అనంతరం సెక్రటేరియట్ లో ఉన్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అడిషనల్ డైరెక్టర్ గారిని, అసిస్టెంట్ డైరెక్టర్ గారిని కలిసి సమగ్ర శిక్షా ఉద్యోగులకు జీతాలకు సంబంధించి బడ్జెట్ తక్షణమే విడుదల చేయాలని కోరారు.**👉 గౌరవ మంత్రి శ్రీ నిమ్మల రాము నాయుడు గారిని కలిసి సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యల పైన వినతిపత్రం ఇచ్చారు.. సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.**👉 సాయంత్రం గౌరవ ఎస్పిడి గారిని కలిసి పెండింగ్ వేతనాలు, సమ్మెకాలపు జీతం చెల్లింపు పై వినతిపత్రం ఇచ్చారు..బడ్జెట్ త్వరగా రావడానికి కోసం ప్రయత్నం చేస్తున్నామని ఎస్పీడీగా తెలియజేశారు. సమ్మె కాలం జీతం, సమ్మె అగ్రిమెంట్ మినిట్స్ లో ఉండే అంశాలను పై గౌరవ మంత్రి గారితో చర్చించి పది రోజుల్లో పరిష్కారం చేస్తామని గౌరవ SPD గారు తెలియజేశారు.**👉 సమగ్ర శిక్షా స్టేట్ ఫైనాన్స్ కంట్రోల్ ఆఫీసర్ గారిని కలిసి జీతాలు బడ్జెట్ విడుదల చేయుటకు చొరవ తీసుకోవాలని కోరారు.**ఈ టీంలో ఈ ముగ్గురితోపాటు, రాజమండ్రి జేఏసీ నాయకులు రామ్మోహన్, ఏలూరు జిల్లా జెఎసి నాయకులు బాలాజీ, ప్రకాశం జిల్లా నాయకులు కిరణ్, వెంకటేష్ వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులు ఉన్నారు.ఈ విషయాన్ని మన సభ్యులందరికీ తెలియజేయండి.*💐💐💐*-కాంతారావు నాని**రాష్ట్ర చైర్మన్*
Wednesday, 26 June 2024
Friday, 17 May 2024
Saturday, 19 November 2022
Thursday, 3 November 2022
కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ఎప్పుడు?
ఒడిషాలో 57 వేల మంది, రాజస్థాన్‌లో 1,10,279 మంది, పంజాబ్‌లో 28 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు రెగ్యులరైజ్ చేశాయి. తెలంగాణ రాష్ట్రంలోనూ ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కాని ఏపి లో ఎన్నికల ముందు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, సమాన పనికి సమాన వేతనాలంటూ ఊరించిన వైసిపి...తీరా ప్రభుత్వం ఏర్పడ్డాక ఇచ్చిన హామీలను అటకెక్కించింది.
*అమలు కాని హామీలు*
'మాట తప్పను, మడమ తిప్పను' అన్నారు వైసిపి నేత జగన్ మోహన్ రెడ్డి. అయితే ఆయన నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వేతనాల విషయంలో, రెగ్యులరైజేషన్ విషయంలో మాట తప్పింది. మడమ తిప్పుతోంది. రాష్ట్రంలో 2,45,000 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, 60 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు అనేక సంవత్సరాలుగా సేవలందిస్తున్నారు. అందరికీ సమాన పనికి - సమాన వేతనం అన్న జగన్ మోహన్ రెడ్డి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు 2005 నుండీ అమలయిన పద్ధతులకు పాతరేసి అతి తక్కువ వేతన పెంపుతో చేతులు దులుపుకొన్నారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగుల బేసిక్‌కు సమానంగా వేతనాల అమలుతో వైఎస్ రాజశేఖరరెడ్డి కాలంలో ఇచ్చిన జీవో3 కు తిలోదకాలిచ్చారు. రెగ్యులర్ ఉద్యోగుల కనీస బేసిక్‌కు సమానంగా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు అమలు చేయాలని సివిల్ అప్పీల్ 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అమలు చేయకుండా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రెగ్యులరైజేషన్ విషయంలోనూ పొంతన లేని కబుర్లు చెబుతున్నది.
*హామీల అమలెప్పుడు?*
సాధ్యమైనంత ఎక్కువ మందిని త్వరలోనే రెగ్యులరైజ్ చేస్తామని సెక్రటేరియట్ సాక్షిగా గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించి 3 సంవత్సరాలైంది. నేటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా ఉంది. రెగ్యులరైజేషన్‌కు 11 వేల మందికే అర్హత ఉందంటూ కొంత మంది అమాత్యులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. గత 20 సంవత్సరాలుగా సేవలందిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్యకు, వీరి లెక్కలకు ఎక్కడా పొంతనే లేదు.
*మారని ప్రభుత్వాల విధానాలు*
ఏళ్ళ తరబడి పని చేయించుకోవడమే కాని కనీసం పనిచేస్తున్న వారి లెక్కనూ సరిగ్గా చెప్పలేకపోవడం మన రాష్ట్రానికే చెల్లింది. 2002 నుండీ నేటి వరకూ పరిపాలన వెలగబెట్టిన పార్టీలన్నీ చాలీచాలని వేతనాలతో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల చేత ఊడిగం చేయించుకుంటున్నాయి. పని చేయడానికి పనికి వచ్చే కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు రెగ్యులరైజేషన్‌కు ఎందుకు అర్హులు కారు? పాలన సాగిస్తున్న పార్టీలు మారుతున్నాయే కాని, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పట్ల వీటి విధానాలు మాత్రం ఒక్కటే. ఈ విషయం ఉద్యోగులు గ్రహించాలి. ఒడిషా తరహాలో సుదీర్ఘ పోరాటానికి సన్నద్ధం కావాలి. ఈ పార్టీల విధానా లపై సమర శీలంగా ఐక్యంగా పోరు సల్పాలి.
*మూడు రాష్ట్రాల్లో రెగ్యులరైజేషన్*
ఒడిషాలో ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి తమకు ఇచ్చిన హామీ ప్రకారం రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ ఉద్యోగులు దశల వారీగా పోరాటాలు నిర్వహించారు. రెండు నెలల పాటు పోరాటాలను ఉధృతం చేశారు. వేలాది మంది ఐక్యంగా ఆందోళనలు నిర్వహించారు. తమ కుటుంబ సభ్యులను, పిల్లలను కూడా పోరాటాల్లో భాగస్వాములను చేశారు. కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు వారికి సహకారం అందించాయి. దాంతో దాదాపు 57 వేల మందిని రెగ్యులరైజ్ చేస్తూ ఒడిషా లోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం నిర్ణయించింది. వీరందర్నీ రెగ్యులరైజ్ చెయ్యడానికి మార్గాన్ని సుగమం చేస్తూ ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం 2022 అక్టోబర్ 16న నోటిఫికేషన్ ఇచ్చింది. రూల్స్‌ను ఆ నోటిఫికేషన్‌లో పొందుపరిచింది. నియమితులైన వారందరూ రెగ్యులర్ పోస్టులో నియమించిన వారిగా పరిగణించబడతారని పేర్కొంది. గ్రూప్-బి, గ్రూప్-సి, గ్రూప్-డి పోస్టుల్లో కాంట్రాక్ట్ పద్ధతిపై నియమించబడిన వారందరికీ రూల్స్‌ను రూపొందించింది. ఆ రూల్స్‌లో పాయింట్ 4(2) ప్రకారం వేతనాలు, నోషనల్ ఇంక్రిమెంట్లను...వారు కాంట్రాక్టు సర్వీసులో జాయిన్ అయిన తేదీని బట్టి నిర్ణయిస్తారు. పాయింట్ 4(3) ప్రకారం 6 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న వారందరికీ వారు జాయిన్ అయిన తేదీ నుండి పే ఫిక్స్ చెయ్యబడుతుంది. పాయింట్ 4(4) ప్రకారం వారికి సర్వీసు బెనిఫిట్లు, ప్రమోషన్లు, పాయింట్ 4(5) ప్రకారం వారి కేడర్‌లో సీనియార్టీ వంటివన్నీ పరిగణించబడతాయి.
రాజస్థాన్‌లో విద్య, పంచాయితీరాజ్ తదితర శాఖల్లో 1,10,279 మంది కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేసే నిర్ణయాన్ని ముఖ్యమంత్రి దీపావళి సందర్భంగా ప్రకటించారు. రాజస్థాన్ లోనూ వివిధ శాఖల్లోని ఉద్యోగులు రెగ్యులరైజేషన్‌కై ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రాజస్థాన్ ప్రభుత్వం ''రాజస్థాన్ కాంట్రాక్ట్ హైరింగ్ టు సివిల్ పోస్టు రూల్స్-2022''ను అమలు చేసే ప్రతిపాదనను ఆమోదించింది. రాష్ట్రంలోని వివిధ శాఖల కాంట్రాక్ట్ కార్మికులందరికి ఈ నిబంధనలను వర్తింపచేస్తామని, వారి సామాజిక భద్రతపై ప్రభుత్వం శ్రద్ధ తీసుకొంటుందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు.
పంజాబ్‌లో నూతనంగా ఏర్పడిన ఆప్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే సిపిఎస్ రద్దు చేసింది.
*ఐక్యంగా పోరాడదాం*
కాని మన రాష్ట్రంలో ఆ పరిస్థితి కనుచూపు మేరలో కనబడటం లేదు. ఎన్నికలకు ముందు ప్రజాసంకల్ప యాత్రలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నేటికీ అమలు చెయ్యలేదు. ఈ విషయంలో వైసిపి ప్రభుత్వానికి జీరో మార్కులే వచ్చాయి. ఆప్కాస్ వల్ల ప్రైవేట్ కాంట్రాక్టర్ బదులుగా ప్రభుత్వ కాంట్రాక్టర్ మాత్రమే వచ్చారు. ఒడిషా ఉద్యోగుల పోరాట స్ఫూర్తితో ఏ.పి లోని కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులంతా శాఖలు, కేడర్లు పక్కనబెట్టి ఐక్యంగా ముందుకు సాగాలి. ఐక్య పోరాటాలు సుదీర్ఘ కాలం సాగించడానికి సన్నద్ధం కావాలి. సమస్యలు పరిష్కారం అయ్యేదాకా సమరశీలంగా ఐక్యంగా పోరాడాలి.
వ్యాసకర్త : ఏ.వి. నాగేశ్వరరావు, రాష్ట్ర చైర్మన్
ఎపి స్టేట్ గవ్నమెంట్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్,టీచర్స్ అండ్ వర్కర్స్ జెఏసి,
సెల్ : 9490098031 /
Thursday, 13 October 2022
సమగ్ర శిక్షా సొసైటీ, కెజిబివి ఉద్యోగులకు మినిమం టైంస్కేల్ అమలు చెయ్యాలి
సమగ్ర శిక్షా సొసైటీ, కెజిబివి ఉద్యోగులకు మినిమం టైంస్కేల్ అమలు చెయ్యాలిఎస్పిడి కార్యాలయం వద్ద రాష్ట్ర స్థాయి ధర్నా సమగ్ర శిక్షా సొసైటీ, కెజిబివి లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, పార్ట్ టైం పద్ధతిలో పనిచేస్తున్న అన్ని కేడర్లకు 25 వేల మంది ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జిఓ నెం 5 ప్రకారం మినిమం టైంస్కేల్: సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని, రద్దు చేసిన ఆర్ట్ క్రాఫ్ట్ పోస్టులను ప్రభుత్వం పునరుద్ధరించాలని డిమాండ్ సెప్టెంబర్ 30వ తేదీన విజయవాడలోని స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర స్థాయి ధర్నా కార్యక్రమం సమగ్ర శిక్షా ఉద్యోగుల జెఎసి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఎస్ఎస్ఎ ఉద్యోగుల ఆందోళనకు మద్దతుగా ఈ కార్యక్రమంలో పిడిఎఫ్ కే.ఎస్. లక్ష్మణరావు, షేక్ సాబ్జి, ఐ.వెంకటేశ్వరరావు ఎంఎల్సీలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కే.ఎస్. లక్ష్మణ రావు మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్నికల కంటే ముందు ప్రతిపక్షనేతగా సమగ్ర శిక్షా ఉద్యోగులకు మినిమం టైంస్కేల్, సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగభద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి 3 సం॥లు అవుతున్నా ఒక్క హామీ కూడా అమలు కాలేదు.. తక్షణమే వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మాట్లాడుతూ 2019లో ప్రభుత్వం సమగ్ర శిక్షా ఉద్యోగులకు, కెజిబివి సిబ్బందికి మినిమం టైంస్కేల్ ఇవ్వాలని జిఓ నెం. 24 ఇచ్చింది. ఆ జిఓను ప్రస్తుత ప్రభుత్వం అమలు చెయ్యకుండా 2020 లో జిఓ నెం 40 ని ఇస్తూ మినిమం టైంస్కేల్ అమలు చేస్తామని పేర్కొంది. ఈ జిఓ కూడా అమలు చెయ్యకుండా గత సంవత్సరం లో జిఓ నెం. 5 ను ప్రభుత్వం విడుదల చేసింది. జిఓ నెం. 5 ప్రకారం సమగ్రశిక్ష సొసైటీ, కెజిబివి ఉద్యోగులతో ఎంటిఎస్ అమలవుతుందనే ఎంతో ఆశతో ఎదురుచూసిన ఉద్యోగులకు నిరాశే మిగిలింది అన్నారు.ఎమ్మెల్సీ ఐ. వెంకటేశ్వరావు మాట్లాడుతూ సమగ్రశిక్షా సొసైటీ, కెజిబివి ఉద్యోగులకు 2017 లో గత తెలుగుదేశం ప్రభుత్వంలో పెరిగిన వేతనాల తోటే నేటీకి బ్రతుకుతున్న పరిస్థితి. ప్రస్తుత ప్రభుత్వం మినిమం టైంస్కేల్ అమలు చేస్తామని జిఓ లు మీద జిఓలు ఇస్తున్నారు తప్ప. ఆచరణలో అమలు చేయటంలేదు. మంత్రులు, ఉన్నతాధికారులు ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసిన సమస్య పరిష్కారం కాలేదు.. సమాన పనికి సమాన వేతనం చెల్లించాల్సిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కేవలం 25 శాతం వేతనాలు పెంచి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఎన్నికల కంటే ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చెయ్యాలని, సమగ్రతీక్షా సొసైటీ, కెజిబివి ఉ ద్యోగులందరికీ మినిమంటైంస్కేల్ అమలు చెయ్యాలని, సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.జెఏసి రాష్ట్ర అధ్యక్షుడు ఎం.బాల కాశి మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే నవంబర్ నెలాఖరులో విద్యాశాఖా మంత్రి ఇల్లు ముట్టడి కార్యక్రమం, డిసెంబరు మొదటి వారంలో ఉద్యోగులతో సామూహిక నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు తెలియచేశారు.. ఈ కార్యాలయం ఎపి స్టేట్ గవ్నమెంట్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జెఏసి ఎవి నాగేశ్వరరావు, సంఘం ప్రధాన కార్యదర్శి బి.కాంతారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే.విజయ్, పిటిఐ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షడు సి.హెచ్. దేవేంద్ర రావు, జెఏసి నాయకులు కల్యాణి, గురువులు, గిరి శ్రీనివాసరావు, భారతి, వాసా శ్రీనివాసరావు, చంద్ర శేఖర్, వెంకట రావు, నాగ రత్నం,రోహిణి, లక్ష్మణ, పాల్గొన్నారు
Wednesday, 20 April 2022
సజ్జల ను కలసి వినతి పత్రం అందచేసిన బాలకాశి
సమగ్ర శిక్షా ఉద్యోగులకు మినిమం ఆఫ్ టైం స్కేల్ చేయాలని కోరుతూ... గౌరవ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలసి, వినతిపత్రం ఇచ్చి జెఏసి రాష్ట్ర అధ్యక్షుడు ఎం.బాలకాశి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.విజయ్.. MTS అమలుకు అడ్డంకిగా ఉన్న నిబంధనలు సవరించాలని కోరడం జరిగింది... ఉద్యోగులల్లో ఉన్న తీవ్ర అసంతృప్తి, ఆవేదనను సజ్జల గారికి తెలియచేయడం జరిగింది..* *ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తానని సజ్జల గారు హామీ ఇచ్చారు..*
*-ఎం.బాలకాశి,*
*రాష్ట్ర అధ్యక్షుడు*
Thursday, 3 March 2022
పీడీఎఫ్ & స్వతంత్ర ఎమ్మెల్సీలు నిరాహారదీక్ష
💥💥💥
*విజయవాడలో ధర్నా చౌక్:*
*పీ.ఆర్.సి, గ్రాట్యుటీ, సిపిఎస్ రద్దు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, గ్రామ సచివాలయంలో ఉద్యోగుల రెగ్యులరైజ్ సమస్యలు పరిష్కారం కోసం.. పీడీఎఫ్ & స్వతంత్ర ఎమ్మెల్సీలు నిరాహారదీక్ష..*
*పీడీఎఫ్ ఎమ్మెల్సీలు విఠపు. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్ లక్ష్మణరావు, వై.శ్రీనివాసులురెడ్డి, ఐ.వెంకటేశ్వరరావు, షేక్ సాబ్జి మరియు స్వతంత్ర ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, పి.రఘు వర్మ లు నిరాహారదీక్ష చేస్తున్నారు.*
*నిరాహారదీక్ష లో పాల్గొన్న ఎపి స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్, టీచర్స్ అండ్ వర్కర్స్ జెఏసి చైర్మన్ ఏవి.నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎం.బాల కాశి, జెఎసి రాష్ట్ర నాయకులు నూర్ మహమ్మద్ పాల్గొన్నారు.. కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగుల రెగ్యులరైజ్, సమాన పనికి సమాన వేతనం, సమగ్ర శిక్షా, కెజిబివి ఉద్యోగులకు MTS అమలు, NHM ఉద్యోగుల వేతనాలు పెంపు తదితర సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..*
*-ఎపి స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్, టీచర్స్ అండ్ వర్కర్స్ జెఏసి,రాష్ట్ర కమిటీ*
Wednesday, 16 February 2022
Tuesday, 15 February 2022
GENERAL ADMINISTRATION (CABINET–II) DEPARTMENTG.O.MS.No. 68 Dated: 20-07-2021ప్రభుత్వ ఆఫీసుల సిబ్బంది పనివేళలు పై జిఓ.. జిల్లా/ మండల కేంద్రం ఆఫీసులు 10.30AM to 5PM (ప్రతి ఆదివారం, రెండవ శనివారం సెలవు)రాష్ట్ర సచివాలయం, అధిపతులుశాఖలు,కార్పొరేషన్లు మరియు ఇతరప్రభుత్వ సంస్థలు(హైదరాబాద్ నుండి కొత్తరాజధాని ప్రాంతం తరలించిన)10.00AM to 5.30 PMఐదు రోజులు పనిదినలు, (ప్రతి శనివారం, ఆదివారం సెలవు)
Chalo Vijayawada on 31.01.2022
Pay revision: contract employees to stage statewide protest today
Concerns of outsourcing and part-time staff brushed aside during recent negotiations’
The Joint Action Committee (JAC) of State Government Contract and Outsourcing Employees, Teachers and Workers said the agreement reached by the PRC Sadhana Samiti with the Group of Ministers (GoM) on Revised Pay Scales - 2022 (RPS) Saturday night left about 3.50 lakh contract, outsourcing and part-time employees and workers high and dry as their concerns were either completely brushed aside or only partially addressed.
They said that there was not even a mention of the demands related to regularisation of services, equal pay for equal work and implementation of minimum time scale in the pact signed by the two sides.
The contract, outsourcing and part-time employees and workers would stage protest demonstrations across the State on February 7 and send emails to Chief Minister YS Jagan Mohan Reddy on February 9, requesting him to accommodate their demands in the scheme of things that has just been formulated.
Announcing this at a media conference on Sunday, JAC chairman A.V. Nageswara Rao and secretary general M. Bala Kasi and part-time employees’ association president Devender said that by surrendering to the government, leaders of the PRC Sadhana Samiti, did a ‘grave injustice to the contract, outsourcing and part-time employees without whose services the government would be crippled.’
Ashutosh Mishra Committee
They argued that the conduct of negotiations without disclosing the recommendations of Ashutosh Mishra Committee was against all norms, but the PRC Sadhana Samiti leaders did not consider it proper to press for that revelation.
The JAC leaders further said a committee of six Ministers was formed three years ago to evolve a mechanism for regularising the services of contract employees, but to no avail as the panel remained practically non-existent. The agitation would be intensified if the government did not sort out the issues on a priority basis, they warned.
సమాన పనికి సమాన వేతనం చెల్లించాల్సిందే : హైకోర్టు
సమాన పనికి సమాన వేతనం చెల్లించాల్సిందే : హైకోర్టు
Published on: Apr 6, 2021, 3:56 AM IST
అధికరణ 14 ప్రకారం ఒకే పనిని నిర్వర్తిస్తున్న వారు సమాన వేతనం పొందేందుకు అర్హులని హైకోర్టు తెలిపింది. దీనిని ధిక్కరిస్తే సమాజంలోని బలహీనవర్గాల ప్రజలను దోపిడికి గురిచేయడం తప్ప మరొకటి కాదని భావించాల్సి వస్తుందని తేల్చి చెప్పింది. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాలలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులు.. ఒకే తరహా పనిని నిర్వహిస్తున్న వారికి సమాన వేతనం చెల్లించాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, తితిదే ఈవో, శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాల డిప్యూటీ డైరెక్టర్‌ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
తాత్కాలిక, శాశ్వత ఉద్యోగి అనే దానితో సంబంధం లేకుండా ఒకే పనిని నిర్వర్తిస్తున్నప్పుడు ఇతర ఉద్యోగుల మాదిరిగానే ప్రతి ఉద్యోగి సమాన వేతనం పొందేందుకు అర్హత ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ విధంగా చెల్లించకపోతే వారి పట్ల వివక్ష చూపడం, అధికరణ 14ను ఉల్లంఘించడమే అవుతుందని స్పష్టం చేసింది.
సుప్రీం అప్పుడే చెప్పింది..సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ ఆర్జిత్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తుచేసింది. పిటిషనర్లలో ఒకే తరహా పనిని నిర్వర్తిస్తున్న వారికి చెల్లిస్తున్న వేతనం, ప్రయోజనాల మాదిరి పిటిషనర్లకూ ఒప్పంద కార్మికులు తక్షణం చెల్లించాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, తితిదే ఈవో, శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాల డిప్యూటీ డైరెక్టర్‌ను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.2011లోనే వాజ్యం దాఖలు..శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాలలో ఒప్పంద కార్మికులుగా ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి గతంలో కల్పించిన కనీస వేతనాలు, ప్రయోజనాలను తమకు వర్తింపచేయాలని 11 మంది చిరు ఒప్పంద కార్మికులు 2011లో హైకోర్టును ఆశ్రయించారు.సమాన వేతనాలు వర్తింప చేయలేదు..2003, 2004 నుంచి శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాలలో పాలు మోయడం, పాల క్యాన్లను శుభ్రపరచడం, పాలు వేడిచేయడం తదితర పనులు ఒప్పంద కార్మికులుగా పనిచేస్తున్నామన్నారు. తితిదే బోర్డు 2007 నవంబర్ 12న చేసిన తీర్మానం ప్రకారం.. గో సంరక్షణ శాలలో అప్పటికే ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న 73 మంది ఒప్పంద కార్మికులకు కనీస వేతనాలు అమలు చేసి ప్రయోజనాలు కల్పించారన్నారు.'కనీస వేతనం వర్తింపజేయాలి'తమలాంటి పనులు నిర్వహించే వారికి కనీస వేతనం, ప్రయోజనాలు కల్పిస్తూ 2007లో ఓ సారి తీర్మానం చేసిన నేపథ్యంలో.. తమకూ కనీస వేతనాల్ని వర్తింపచేయాలన్నారు.2010లో వేతనాలు పెంచాలని వినతి !తితిదేలో ఒప్పంద పొరుగు సేవల కింద పనిచేసే సుమారు 8000 సిబ్బంది వేతనాల పెంపు తదితర విషయాలు నిలిపేస్తూ 2011 మే 26న చేసిన తీర్మానం తమకు వర్తించదన్నారు. 2011 మే తీర్మానం చేయడానికి ముందే తమకు ఇదేళ్ల సర్వీసు పూర్తి అయిందన్నారు. వేతనాలు పెంచాలని కోరుతూ 2010 డిసెంబర్ 15న వినతి ఇచ్చామన్నారు.వారు వినతి ఇవ్వలేదు : తితిదే లాయర్తితిదే తరపు న్యాయవాది ఎ.సుమంత్ వాదనలు వినిపిస్తూ.. ఆ తేదీన పిటిషనర్లు వినతి సమర్పించలేదన్నారు. రికార్డుల్లో అది లేదన్నారు. 2011 మే 26న తితిదే బోర్డు తీర్మానం ప్రకారం పిటిషనర్లు ఉపశమనం పొందలేదన్నారు. ఇరువైపు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఇదే తరహా పనులు చేస్తున్న వారికి వేతనాలు పెంచిన నేపథ్యంలో పిటిషనర్లకు పెంచాలా లేదా అనే విషయాన్ని తుది విచారణలో నిర్ణయించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.కరోనా ఉద్ధృతి తర్వాత భౌతిక విచారణ : హైకోర్ట్కరోనా ముప్పు తొలిగాక ఈ వ్యాజ్యంపై భౌతిక విచారణ జరపాల్సి ఉందన్నారు. శ్రీవారి పాదాల చెంత ఇతర ఉద్యోగుల మాదిరిగానే పిటిషనర్లు గత 15 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. పిటిషనర్లతో పాటు ఒకే తరహా పని నిర్వర్తిస్తున్న వారికి చెల్లిస్తున్న కనీస వేతనాన్ని పిటిషనర్లకు చెల్లించాలని ఆదేశించారు.
సమాన వేతనం ఏదీ ?
ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానానికి, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పెంచిన జీతాలకు అసలు పొంతనే లేదు. ఉదాహరణకు గత ప్రభుత్వం హయాంలో దిగువ స్థాయి పర్మినెంట్ ఉద్యోగుల బేసిక్ వేతనం రూ. 13,000 కాగా, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రూ. 12,000 చెల్లించారు. ప్రతి నెలా రూ. 1,000 నష్టం చేకూరింది. ప్రస్తుత ప్రభుత్వ హయంలో దిగువ స్థాయి పెర్మనెంట్ ఉద్యోగి బేసిక్ వేతనం రూ. 20,000 కాగా, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రూ. 15,000 నిర్ణయించారు. అంటే నెలవారీ తేడా రూ. 5000కి పెరిగింది !
వై.యస్.ఆర్.సి.పి అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు, ఎన్నికల అనంతరం అనేకసార్లు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి ప్రస్తావించారు. ప్రతిపక్ష నేతగా ఉండగా అసెంబ్లీలో టి.డి.పి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ''ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి మోసగించిందని, మీరు చేయకపోతే మేము అధికారంలోకి రాగానే రెగ్యులరైజ్ చేస్తామని'' అన్నారు. ''సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ప్రాతిపదికగా న్యాయం'' చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు.
అధికారంలోకి వచ్చాక అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి తీసుకువెళ్ళేది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులేనని, వారు సంతోషంగా ఉంటేనే ప్రజలలో ప్రభుత్వం పట్ల సానుకూలత ఉంటుందని, అందువల్ల వారి సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి కృషి చేస్తుందని అన్నారు. ప్రతి నెలా మూడవ శుక్రవారం ముఖ్యమంత్రి నుండి దిగువ స్థాయి అధికారులు అందరూ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కేటాయించా లని ఆదేశించారు. రెండున్నరేళ్ళలో ఒకే ఒక్క రోజు దిగువ స్థాయి అధికారులు ఉద్యోగుల నుండి అర్జీలు స్వీకరించారు. ఆ తరువాత వీరి గురించి పట్టించుకున్న నాధుడు లేడు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పి.ఆర్.సి జీవోలతో పాటు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపుదల చేస్తూ జీవో. నెం.7ను జారీ చేసింది. దీని ప్రకారం గతంలో రూ.12,000, రూ.15,000, రూ.17,500 జీతాలు పొందుతున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రూ. 15,000, రూ.18,500, రూ.21,500 గా పెంచింది. దీనితో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు భారీ ఆర్థిక లబ్ధి చేకూరినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం, దీనికి అనుకూలంగా ఉన్న మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది.
ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానానికి, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పెంచిన జీతాలకు అసలు పొంతనే లేదు. ఉదాహరణకు గత ప్రభుత్వం హయాంలో దిగువ స్థాయి పర్మినెంట్ ఉద్యోగుల బేసిక్ వేతనం రూ. 13,000 కాగా, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రూ. 12,000 చెల్లించారు. ప్రతి నెలా రూ. 1,000 నష్టం చేకూరింది. ప్రస్తుత ప్రభుత్వ హయంలో దిగువ స్థాయి పెర్మనెంట్ ఉద్యోగి బేసిక్ వేతనం రూ. 20,000 కాగా, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రూ. 15,000 నిర్ణయించారు. అంటే నెలవారీ తేడా రూ. 5000కి పెరిగింది!
పెర్మనెంట్ ఏ.ఎన్.ఎం లకు గత ప్రభుత్వ హయాంలో బేసిక్ వేతనం రూ. 21,230 కాగా, ఔట్‌సోర్సింగ్ ఏ.ఎన్.ఎం లకు రూ. 15,000 చెల్లించారు. నెలవారీ తేడా రూ. 6,230. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పెర్మనెంట్ ఏ.ఎన్.ఎం లకు బేసిక్ వేతనం రూ. 32,670 కాగా, ఔట్‌సోర్సింగ్ ఏ.ఎన్.ఎం.లకు రూ.18,500 నిర్ణయించారు. నెలవారీ తేడా ఏకంగా రూ. 14,170!
పెర్మనెంట్ స్టాఫ్ నర్స్‌లకు గత ప్రభుత్వ హయాంలో బేసిక్ వేతనం రూ. 25,140 కాగా, ఔట్‌సోర్సింగ్ స్టాఫ్ నర్స్‌లకు రూ. 17,500 చెల్లించారు. నెలవారీ తేడా రూ. 7,640. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో స్టాఫ్‌నర్స్‌ల బేసిక్ వేతనం రూ. 38,720 కాగా, ఔట్‌సోర్సింగ్ స్టాఫ్‌నర్స్‌లకు రూ. 21,500 నిర్ణయించారు. నెలవారీ తేడా రూ. 17,220 వాటిల్లుతోంది. ఆ విధంగా ప్రస్తుత ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం అన్ని క్యాడర్ల ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెలా భారీ ఎత్తున నష్టం పెరిగింది. కాగా ప్రభుత్వం మాత్రం రివర్స్‌లో ''భారీ లబ్ధి'' చేకూరినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నది.
గత 20 ఏళ్ళుగా ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ళకొకసారి పి.ఆర్.సి ప్రకారం జీతాలు పెరిగిన అనంతరమే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు కూడా జీతాలు పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పి.ఆర్.సి కాలాన్ని పదేళ్ళకు పెంచింది. అంటే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు కూడా తమ జీతాల పెంపుదల కోసం మరో పదేళ్ళు ఎదురు చూడాలన్నమాట. ఇది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను సైతం మరింతగా నష్టం కలిగించే విషయం.
రాష్ట్ర సచివాలయం లోనూ, హైకోర్టు లోనూ, సి.ఆర్.డి.ఏలోనూ, ప్రభుత్వ ఆసుపత్రులలోనూ, ఇతర అనేక చోట్ల పని చేసే వారికి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జి.ఓ ప్రకారం జీతాలు కూడా చెల్లించడం లేదు. వర్క్ ఔట్‌సోర్సింగ్ విధానంతో వీరు మరింతగా నష్టపోతున్నారు. వీరికి కేవలం 7 నుండి 10 వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. ఇది మరీ అన్యాయమైన దోపిడీ.
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో వాస్తవాలను మరుగుపరచి ఉద్యోగులను, ప్రజలను తప్పుదారి పట్టించే దుర్మార్గమైన ప్రచారాలను రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలి. ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 11వ పి.ఆర్.సి ప్రకారం పెర్మనెంటు ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు చెల్లించాలి. వర్క్ ఔట్‌సోర్సింగ్ విధానం రద్దు చేసి వారందరికీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీవో ప్రకారం జీతభత్యాలు ఇవ్వాలి. రాష్ట్రంలోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులంతా తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ ఐక్య ఉద్యమంలో భాగస్వాములు కావాలని జెఏసి ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్టు అండ్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్, టీచర్స్ అండ్ వర్కర్స్ పిలుపునిస్తున్నది.
/ వ్యాసకర్త : ఛైర్మన్ జెఏసి ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్టు అండ్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్,
టీచర్స్ అండ్ వర్కర్స్, గుంటూరు జిల్లా /
వై. నేతాజి
Monday, 14 February 2022
Sunday, 13 February 2022
Wednesday, 9 February 2022
Subscribe to:
Posts (Atom)






